గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో సకాలంలో పన్ను చెల్లించడం, మిద్దె తోటల పెంపకం, ఇంకుడు గుంతల ఏర్పాటు, వ్యర్ధాలను తడి పొడిగా వేరు చేసి ఇవ్వడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, నగర అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే ప్రజలకు ప్రత్యేక యాప్ ద్వారా సిటిజన్ రివార్డ్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో సోషల్ ఇంపాక్ట్ ఇన్నోవేషన్ సంస్థ ప్రతినిధి సమీర్ గౌతమ్ సిటిజన్ రివార్డ్స్, అమలు, ప్రజలు వినియోగించుకునే తీరుని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజలు తమ వంతుగా స్వచ్చ గుంటూరులో, నగరాభివృద్ధిలో భాగస్వాములు కావడానికి జిఎంసి నుండి ప్రోత్సాహకంగా ప్రత్యేకంగా సిటిజన్ రివార్డ్స్ ని అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగా సమీర్ గౌతమ్ మంగళవారం వివరాలను విభాగాధిపతులకు వివరించారని, త్వరలో యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తామన్నారు. నగర ప్రజలు తాము చెల్లించాల్సిన పన్నులు సకాలంలో చెల్లించడం, వ్యర్ధాలను వేరువేరుగా అందించడం, ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకోవడం ద్వారానే ప్రత్యేక యాప్ ద్వారా అందించే క్యూఆర్ కోడ్ ద్వారా రివార్డ్స్ అందేలా జిఎంసి చేపడుతుందన్నారు.
సమావేశంలో అదనపు కమిషనర్ సిహెచ్.ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, ఎస్.ఈ. నాగమల్లేశ్వరరావు, సిటి ప్లానర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
“దివిసీమ ఉప్పెన” నేటికీ 47 సంవత్సరాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సుమారుగా 10 వేల మంది ప్రాణాలు బలిగొని , లక్షలాది మంది జీవితాలను …