Breaking News

అభివృద్ధి – సంక్షేమం కోసం పోరాటానికి సిద్ధం అవుతున్న టీడీపీ…


-చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం
– వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ..
-ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు – ప్రజలపై భారాలను ఉపసంహరించేంతవరకు ఉద్యమిస్తాం.
-పొలిట్బ్యూరో సమావేశంలో పాల్గున్న మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా సమయంలో ప్రజలను ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా ఆదుకోవడంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అని, యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్రంలో లక్షలలో ఉద్యోగాలు కలిగే ఉంటె కేవలం 10వేలు మాత్రమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం యువశక్తిని నిర్వీర్యం చేయడమే అని, మహిళలకు రక్షణ కల్పించలేని వైసీపీ ప్రభుత్వం దిశ యాప్ పేరుతో చేతులు దులుపుకోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం అని ప్రజలమీద పన్నుల భారాలు విపరీతంగా మోపుతున్న జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యడంలో ప్రజలకు సంక్షేమాన్ని అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు  తెలియజేసారు. గురువారం మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పొలిట్బ్యూరో సమావేశం జరిగింది..ఈ సమావేశంలో పాల్గొన్న పొలిట్బ్యూరో సభ్యులు బోండా ఉమ సమావేశంలోని ఎజండాలపైన చర్చించి మాట్లాడడం జరిగింది. ఈ సమావేశంలో ఈ అంశాలపై బోండా ఉమా మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, రాష్ట్ర అభివృద్ధికి జగన్ రెడ్డి తిరోధకాలు ఇస్తూ నవరత్నాల పేరుతో సంక్షేమ పధకాలు నామమాత్రంగా అర్హులకు అందిస్తున్నారని, రాష్ట్రానికి దిశ దశ అయిన యువతను, విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తూ యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నారని, చివరకు రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలలో లక్షలాది ఉద్యోగాలు కాలిగా ఉన్నా భర్తీ చేయడం చేతగాని ఈ ప్రభుత్వం కేవలం 10వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసే జాబ్ క్యాలెండర్ ను ప్రకటించడం వీరి నిజస్వరూపానికి నిదర్శనం అని, ముఖ్యమంత్రి ఇంటికి కూత వెతు దూరంలో మహిళపై అత్యాచారం జరిగితే నిందితులను ఇన్నిరోజులైనా అరెస్ట్ చేయకపోవడం మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని, దిశ యాప్, దిశ చట్టాలు, దిశ పోలీస్ స్టేషన్ అంటూ మహిళలను మోసం చేస్తున్నారు అని కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవలసిన జగన్ మోహన్ రెడ్డి గదులకు పరిమితం అయ్యి ప్రజల ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేసి ప్రభుత్వ దావాఖానాలో సరైన వైద్యం అందించకుండా కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్ ను పెంచి పోషించే విధంగా వ్యవహరించి చివరికి ఆక్సిజన్ కూడా అందనటువంటి పరిస్థితిలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, కరోనా వ్యాక్సిన్ ని రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి అందరికి అందించడంలో వైస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అని రాష్ట్ర అభివృద్ధిని సూన్యం చేశారని, సంక్షేమం అర్హులందరికీ అందడంలేదని, డీజిల్, పెట్రోల్ ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అందుతున్నాయని ప్రజలపై పన్నుల భారం నానాటికి పెరుగుతుందని చివరకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చులకు కూడా జామా ఖర్చులు లెక్కలు సరిగా లేవని, ప్రాజెక్టులు పూర్తి చెయ్యడంలేదని, నీటి వాటాలు తీసుకురావడంలో పక్క రాష్ట్రాలతో లాలూచి పడుతున్నారని ఉచిత ఇసుకను అందించలేని జగన్ రెడ్డి మద్యానికి గేట్లు బార్ల తెరిచారని వీటన్నిటిపైనా ఈరోజు జరిగిన పొలిట్బ్యూరో సమావేశంలో చర్చించడం జరిగిందని, వీటిపై చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను భాగస్వామ్యం చేసుకుని పోరాట కార్యాచరణతో ఉద్యమిస్తాం అని బోండా ఉమా తెలియజేసారు.

Check Also

వీఎం రంగా నాయకత్వంలో పనిచేసినందుకు గర్వపడుతున్నా…

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు అండగా నిలిచేతత్వమే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *