Breaking News

Tag Archives: AMARAVARTHI

సి.ఎం.జగన్ అణగారిన వర్గాల పక్షపాతి ఉప ముఖ్యమంత్రి, ఆబ్కారీ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అణగారిన వర్గాల పక్షపాతిగా చరిత్రలో నిలిచిపోతారని ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని ఎస్.సి.,ఎస్.టి., బి.సి., మైనారిటీలతో పాటు ఇతర వర్గాల వారికి అవసరమైన స్మశాన వాటిక స్థలాలను వెంటనే గుర్తించేందుకు చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో ఎస్.సి.,ఎస్.టి.,బి.సి. మైనారిటీలతో పాటు ఇతర వర్గాల వారికి స్మశాన వాటికలు …

Read More »

ఎస్సీ గురుకులాల్లో సీట్ల కోసం విపరీతమైన డిమాండ్

-అవకాశాన్ని బట్టి అందరికీ సీట్లు -ఎస్సీ హాస్టళ్లపై నిరంతర పర్యవేక్షణ -మంత్రి మేరుగు నాగార్జున అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ గురుకులాల్లో సీట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో అర్హత కలిగిన ప్రతి విద్యార్థికీ అవకాశాన్ని బట్టి సీట్లు కేటాయించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. ఎస్సీ హాస్టళ్లపై నిరంతర పర్యవేక్షణ చేయాలని, పదవ తరగతి విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. సచివాలయంలో బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే …

Read More »

గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాధం మోపాలి

-ఉప ముఖ్యమంత్రి, ఆబ్కారీ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాధం మోపాలని ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఆబ్కారీ శాఖ స్పెషల్ సి.ఎస్. రజత్ భార్గవ, కమిషనర్ వివేక్ యాదవ్, ఎ.పి.ఎస్.బి.సి.ఎల్. ఎం.డి. వాసుదేవ రెడ్డి తదితరులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ వీడియో కాన్పరెన్సు ద్వారా పాల్గొన్న ఈ …

Read More »

పర్యాటక ప్రదేశాలు మరింత అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తాం…

-గ్రామ గ్రామానా క్రీడా ప్రాంగణాలు – మంత్రి శ్రీమతి ఆర్. కె. రోజా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సచివాలయంలోని మంత్రి చాంబర్ లో టూరిజం, సాంస్కృతిక మరియు క్రీడా శాఖా అధికారులతో రాష్ర్ట పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్. కె. రోజా సమీక్షా సమావేశం నిర్వహించారు. టూరిజం సాంస్కృతిక మరియు క్రీడా శాఖ స్పేషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఓడిలతో శాఖల వారీగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పస్తుతం పురోగతిలో వున్న పనుల ప్రగతిని …

Read More »

-రాష్ట్రంలో వైద్య ఆరోగ్య‌శాఖ‌కు కొత్త రూపు -ఏపీవీవీపీ ఆస్ప‌త్రుల స్వ‌రూపం మారిపోతోంది -ఒక్కో ఆస్ప‌త్రికి స‌గ‌టున‌ వంద మంది సిబ్బంది -జ‌గ‌న‌న్న అడ‌గ‌కుండానే అన్నీ ఇస్తున్నారు -ఏపీవీవీపీలో ఎన్నో సంస్క‌ర‌ణ‌లు తీసుకొస్తున్నాం -పూర్తి ప్ర‌క్షాళ‌న దిశ‌గా సెకండ‌రీ వైద్య విధానం -1220 కోట్ల‌తో ఏపీవీవీపీ ఆస్ప‌త్రుల అభివృద్ధి -ఏక‌రీతిగా ఇక ఆస్ప‌త్రులు -ఒకేలా సిబ్బంది, వ‌స‌తులు -గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో కునారిల్లిపోయిన ప్ర‌భుత్వ వైద్యం -జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వంలో జ‌వ‌స‌త్వాలు నింపుకుంటున్న ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు -పేద‌ల ఆరోగ్యానికి ఇక పూర్తి భ‌ద్ర‌త‌ -ఏపీవీవీపీ విభాగంపై స‌మీక్ష‌లో …

Read More »

ఏపీలో విద్యార్థులకు మరో వరం

-జగనన్న విదేశీ విద్యా దీవెనపై ఉత్తర్వులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధప్రదేశ్‌లో విద్యార్థుల కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో సంక్షేమ పథకం తీసుకొచ్చింది. విదేశీ విద్యను అభ్యసించే అర్హులైన వాళ్ల కోసం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’పై ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఇప్పుడు అమలు అవుతున్న సంక్షేమ పథకం లాగే.. పక్షపాతం లేకుండా ప్రతిభకే పెద్దపీట వేసేలా ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాల వారికీ వర్తించేలా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. క్యూఎస్‌ …

Read More »

అమర్‌నాథ్‌ యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమర్‌నాథ్‌ యాత్రలోకుండపోత వాన, ఆకస్మాత్తుగా వరదలు వచ్చాయన్న సమాచారం నేపథ్యంలో రాష్ట్రం నుంచి వెళ్లిన పలువురి యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో సీఎంఓ అధికారులు ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌తో మాట్లాడారు. అడిషనల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ఉన్న హిమాంశు కౌసిక్‌ను వెంటనే శ్రీనగర్‌కు పంపిస్తున్నారు. యాత్రికుల భద్రత, తీసుకోవాల్సిన చర్యలపై …

Read More »

పారిశ్రామిక కారిడార్ల ద్వారా 25 వేల ఎకరాలలో రూ.లక్ష కోట్లపైన పెట్టుబడులు : మంత్రి గుడివాడ అమర్ నాథ్

-2040 కల్లా కేవలం పారిశ్రామికవాడల ద్వారా 5,50000మందికి ఏపీలో ఉద్యోగాలు -సెప్టెంబర్ 2022 కల్లా మూడు కారిడార్ల కీలక పనులు కొలిక్కి -3 కారిడార్లను అభివృద్ధి చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ : పరిశ్రమలు, వాణిజ్యం, ఐ.టీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ -ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ -కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన అపెక్స్ మానిటరింగ్ అథారిటీ సమావేశం -ఢిల్లీ వేదికగా డీపీఐఐటీ, నిక్డిక్ట్ నేతృత్వంలో జరిగిన “జాతీయ పారిశ్రామిక …

Read More »

పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి ప్రశంసల జల్లు

-ఈవోడీబీ 2020 ర్యాంకింగ్స్ లో ఏపీని అగ్రగామిగా నిలపడంపై సీఎం అభినందన -ఇదే కృషిని కొనసాగించాలన్న ముఖ్యమంత్రి ప్రశంసలు మరింత స్ఫూర్తి నింపాయి: పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సులభతర వాణిజ్య రాష్ట్రాల ర్యాంకింగ్స్ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ -ఈవోడీబీ)లో ఆంధ్రప్రదేశ్ ని మొదటి స్థానంలో నిలిపిన పరిశ్రమల శాఖ ఉన్నతాధికారుల కృషిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించినట్లు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ …

Read More »

శాసన సభ ప్రాంగణంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

-ఘనంగా నివాళులు అర్పించిన శాససభ కార్యదర్శి పి.బాలకృష్టమాచార్యులు అమరావతి, జూలై 4: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125 వ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రాంగణంలో ఘనంగా వేడుకలు జరిగాయి. శాసన సభ కమిటీ సమావేశ మందిరంలో శాసన సభ కార్యదర్శి పి.బాలకృష్టమాచార్యులు, ఇతర అధికారులు, సిబ్బంది అంతా సమావేశమై మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా శాసన సభ కార్యదర్శి పి.బాలకృష్టమాచార్యులు మాట్లాడుతూ …

Read More »