-రవాణాశాఖ కమీషనర్ టిఎస్ఆర్ ఆంజనేయులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణాశాఖలోని సర్వర్ లో సాంకేతిక సమస్య కారణంగా రవాణాశాఖ అందించే అన్నిసేవలకు అంతరాయం కలిగిందని సాంకేతిక సిబ్బంది సహాయంతో ఆసమస్యను పరిష్కరించి శుక్రవారం ఉదయానికి సేవలను పునరుద్ధరించే దిశగా కృషి చేస్తున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ కమీషనర్ టిఎస్ఆర్ ఆంజనేయులు తెలియజేశారు. ఈవిషయాన్ని ఇప్పటికే డీలర్లు అందరికీ తెలియజేయడం జరిగిందని ఆయన తెలిపారు. సాంకేతిక సమస్య పరిష్కారం కాగానే శుక్రవారం ఉదయం నుండి రవాణా శాఖలో వాహనాల రిజిస్ట్రేషన్లు యదావిధిగా అనుమతిస్తామని …
Read More »Tag Archives: AMARAVARTHI
శాఖలవారీ జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించండి:సిఎస్ డా.సమీర్ శర్మ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ శాఖల వారీగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించి వీలున్నంత వరకూ ఉద్యోగులకు సంబంధించిన వివిధ సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ కార్యదర్శులను ఆదేశించారు.అలాగే జిల్లా కలెక్టర్ల స్థాయిలో కూడా జిల్లా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించి జిల్లా స్థాయిలో పరిష్కారం కావాల్సిన అంశాలను ఆస్థాయిలోనే పరిష్కారం అయ్యేలా చూడాలని చెప్పారు.బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో సిఎస్ అధ్యక్షతన కార్యదర్శుల …
Read More »మంత్రులు, కార్యాలయ అధికారులు సమక్షంలో కేక్ కట్ చేసిన సీఎం జగన్…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నివాసంలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రులు, కార్యాలయ అధికారులు సమక్షంలో సీఎం వైఎస్ జగన్ కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రి వైయస్.జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), పేర్ని వెంకట్రామయ్య(నాని), వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, వి బాలశౌరి, సీఎస్ సమీర్ శర్మ, సీఎం ప్రిన్సిపల్ …
Read More »విజయకీలాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి స్వర్ణ కిరీటం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి శనివారం శ్రీమాన్ వెంకటేశ్వరరావు, లక్ష్మీ తులసమ్మ దంపతులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి స్వర్ణ కిరీటాన్ని సమర్పించారు.
Read More »క్రిస్మస్ సంక్రాంతి సెలవులివే…
-ఈనెల 23 నుంచి క్రిస్మస్, జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 23 నుంచి క్రిస్మస్, జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆఈర్టీ) అకడమిక్ క్యాలెండర్‌లో పొందుపరిచింది. క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి 30వ తేదీ వరకు ఉంటాయి. క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి. డిసెంబర్ 31న …
Read More »వి.ఐ.టి.-ఏ.పి విశ్వవిద్యాలయంలో 3రోజుల ఐసిబిటిఇజియస్ (ICBTEGS) అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వి.ఐ.టి – ఎ.పివిశ్వవిద్యాలయంలో గురువారం వి.ఐ.టి – ఎ.పిస్కూల్ ఆఫ్ బిజినెస్ (VSB) అధ్వర్యంలో 3 రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ ఎక్సలెన్స్ ఇన్ గ్లోబల్ సినారియో (ICBTEGS) అంతర్జాతీయ సదస్సు వర్చ్యువల్ విధానంలో ప్రారంభమయ్యింది. ఈసదస్సు16న ప్రారంభమై , 18 డిసెంబర్ 2021వరకువర్చ్యువల్ విధానంలో కొనసాగుతుంది.ఈప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా సీనియర్ డైరెక్టర్ ఎకనామిక్ యూత్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ డైరెక్టరేట్, కామన్వెల్త్ సెక్రటేరియట్, యునైటెడ్ కింగ్‌డమ్ డా|| రూత్ కట్టమూరి …
Read More »శాసన పరిషత్ సభ్యునిగా అనంత సత్య ఉదయ భాస్కర్ ప్రమాణ స్వీకారం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ కు నూతనంగా ఎంపికైన అనంత సత్య ఉదయ భాస్కర్ (బాబు) శాసన పరిషత్ సభ్యునిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థలకు శాసన పరిషత్ సభ్యులుగా ఎంపికైన అనంత సత్య ఉదయ భాస్కర్ (బాబు) చే శాసన పరిషత్ సభ్యునిగా ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు తమ ఛాంబరులో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ కు నూతనంగా ఎంపికైన 11 …
Read More »ఉద్యోగ సంఘాలతో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్,సిఎస్ సమీర్ శర్మలు సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల సమస్యలపై అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో గురువారం రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మలు సమావేశమై వివిధ అంశాలపై విస్తృతంగా సమీక్షించారు.ఈసమావేశంలో ఎపి జెఎసి మరియు ఎపి జెఎసి అమరావతి ఐక్యవేదిక,ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం,ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తదితర సంఘాలు పాల్గొన్నాయి.ఈసందర్భంగా తొలుత ఎపి జెఎసి మరియు ఎపి జెఎసి అమరావతి ఐక్య వేదిక సంఘాలతో ఉద్యోగుల సమస్యలపై చర్చించగా 71 డిమాండులతో కూడిన నివేదికను ఆర్ధికమంత్రి …
Read More »భిన్నత్వం లో ఏకత్వం భారత దేశం యొక్క విశిష్టత… : బి జె ప్రసన్ననెహ్రూ యువ కేంద్ర సంఘటన్ రాష్ట్ర సంచాలకులు
-రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలలో ప్రధమ స్థానం లో నిలిచిన ఎం కార్తీక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖా నెహ్రూ యువ కేంద్ర గుంటూరువారి అద్వర్యం లో “దేశభక్తి మరియు జాతి నిర్మాణం” అంశం ఫై రాష్ట్రము లో అన్ని జిల్లా ల నుంచి జిల్లా స్థాయి విజేతలకు రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ ఉపన్యాస పోటీలు రిపబ్లిక్ డే 2022 ఉత్సావాలలో భాగంగా “కలిసి మేము పెరుగుతాము, …
Read More »ఎస్సీల లబ్దికై నూతన పథకాలను ప్రతిపాదించాలి…
-రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని షెడ్యూల్డు కులాలవారికి మరింత లబ్దిచేకూర్చే విధంగా నూతన పథకాలను ప్రతిపాదించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎస్సీ కంపొనెంట్ ప్లాన్ అమలు తీరును సమీక్షించేందుకు గురువారం అమరావతి సచివాలయం 5 బ్లాక్ సమావేశ మందిరంలో మంత్రి అధ్యక్షతన రాష్ట్ర నోడల్ ఏజెన్సీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మూస పద్ధతిలో పాత పథకాలను మాత్రమే …
Read More »