Breaking News

Tag Archives: amaravathi

29న జాతీయ క్రీడాదినోత్సవం నాడు క్రీడా ప్రతిభ అవార్డులు ప్రదానం…

-2019-20 విద్యా సం.రంలో క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన పాఠశాలలు ఎంపిక -రాష్ట్రంలో జిల్లాకు 5 వంతున 65 పాఠశాలలు ఎంపిక -మొదటి స్థానానికి 10వేలు, ద్వితీయ 8వేలు, తృతీయ 6వేలు,నాల్గవ స్థానానికి 4వేలు, 5వ స్థానానికి 2వేలు నగదు పురస్కారతోపాటు జ్ణాపిక, సర్టిఫికెట్ -రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చినవీరభద్రుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 29వతేదీన జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడా ప్రతిభ అవార్డులు (School of Sports Excellence) ప్రధానం చేయడం జరుగుతుందని రాష్ట్ర పాఠశాల …

Read More »

ఎస్సీ విద్యార్థిని హత్య ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ స్పందన అభినందనీయం…

-కేసును వేగవంతంగా డీల్ చేసిన అధికారులకు అవార్డులకై కేంద్రానికి సిఫార్సు చేస్తాం -ఎస్సీ వినతుల సత్వర పరిష్కారానికై రాష్ట్రంలో ప్రత్యేక సెల్ ఏర్పాటుకు చర్యలు -జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హాల్దర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య దారుణ హత్య ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం స్పందన అభినందనీయమని జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హాల్దర్ ప్రశంసించారు. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరుకు 200 మార్కులు వేయవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం …

Read More »

ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు నుండి దరఖాస్తులు ఆహ్వానం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో డిప్యూటేషన్ (ఎఫ్.ఎస్.టి.సి.) పై పని చేయడానికి ఆసక్తిగల ప్రధానోపాధ్యాయులు మరియు స్కూల్ అసిస్టెంట్లు నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి  శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ నందు ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు అర్హులని తెలిపారు. ఆసక్తిగలవారు తమ దరఖాస్తులను సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి లేదా ప్రాంతీయ సంయుక్త సంచాలకుల ద్వారా ఈ నెల 31వ తేదీలోపు పంపాలని కోరారు. …

Read More »

అజాది కా అమ్రిత్ మహోత్సవం – ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తాడేపల్లి సీతానగరం వద్ద శనివారం ‘అజాది కా అమ్రిత్ మహోత్సవం – ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0’ సందర్భంగా సిఆర్పిఎఫ్ కానిస్టేబుళ్లు నిర్వహించిన సైకిల్ ర్యాలీని జెండా ఊపి ఎమ్మెల్యే ఆర్కే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ కి సంబంధించిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More »

ధర్మ పరిరక్షణ… త్యాగ నిరతికి ప్రతీక మొహర్రం… : పవన్ కల్యాణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లింలు పవిత్రంగా నిర్వహించుకొనే మొహర్రం మానవాళికి దివ్య సందేశాన్ని అందిస్తుంది. త్యాగ నిరతికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం మానవతావాదాన్ని తెలియచేస్తుంది. ధర్మ పరిరక్షణ, శాంతియుత సమాజ స్థాపన కోసం మహ్మద్ ప్రవక్త మనుమడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన ప్రాణ త్యాగం నుంచి ప్రస్తుత సమాజం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రజలను కంటికి రెప్పలా కాపాడవలసిన రాజు యజీద్ ప్రజా కంటకునిగా మారడాన్ని ఇమామ్ హుస్సేన్ తీవ్రంగా నిరసించారు. కుటుంబంతో సహా తన అనుచరులతో …

Read More »

కోవిడ్‌ పరిస్థితులపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ స్కూళ్లు తెరిచినందున అక్కడ కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలి: అధికారులకు  సీఎం  వైయస్‌.జగన్‌ స్పష్టం చేసారు. వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పాటించేలా అధికారులు దృష్టిపెట్టాలన్నారు. దీనిపై ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. మాస్క్‌లు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూళ్లలో …

Read More »

సులభతర వాణిజ్యంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ కున్న అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలి : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సులభతర వాణిజ్యం(Ease of Doing Business)అంశంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అగ్రస్థానాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ స్పష్టం చేశారు.సోమవారం అమరావతి సచివాలయంలో ఆయన అధ్యక్షతన పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సులభతర వాణిజ్యం, మినిమైజేషన్ ఆఫ్ రెగ్యులేటరీ కాంప్లయన్స్ బర్డెన్(MRCB) అంశాలపై వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ సులభతర వాణిజ్యం విషయంలో దేశంలో మన రాష్ట్రానికున్న అగ్రస్థానాన్ని అదే స్థాయిలో నిలబెట్టుకునే ప్రయత్నం …

Read More »

తొలివిడత నాడు–నేడు కింద ఆధునికీకరణ చేపట్టిన ప్రభుత్వ స్కూళ్లను అంకితం చేసిన సీఎం వైయస్‌.జగన్‌

  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పి.గన్నవరం, తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం తొలివిడత నాడు–నేడు కింద ఆధునికీకరణ చేపట్టిన ప్రభుత్వ స్కూళ్లను సీఎం వైయస్‌.జగన్‌ అంకితం చేసారు.  రెండో విడత నాడు–నేడు పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. విద్యార్ధులకు విద్యాకానుక కిట్స్‌ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. పి.గన్నవరం నియోజకవర్గంలో ఇక్కడున్న చిట్టిపిల్లలు, అక్కచెల్లెమ్మలు, సోదరులు, స్నేహితులు, అవ్వాతాతలు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మూడు …

Read More »

టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన వై.వి.సుబ్బారెడ్డిని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శ‌నివారం తాడేపల్లిలోని వై.వి.సుబ్బారెడ్డి నివాసంలో మర్యాదపూర్వక భేటీ  అయిన మ‌ల్లాది విష్ణు మాట్లాడుతూ టీటీడీ ఛైర్మన్‌గా వై.వి.సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించడం సంతోషదాయకం అన్నారు. రెండు సార్లు టీటీడీ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన వారి జాబితాలో వై.వి.సుబ్బారెడ్డి నాలుగో స్థానంలో ఉండడం ఆనందదాయకం అన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి …

Read More »

48 గంటల్లో అల్పపీడనం: ఏపీ లో పలు చోట్ల భారీ వర్షాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ బంగాళాఖాతం, దానికి అనుకుని వాయువ్య బంగాళాఖాతం కేంద్రంగా ఈ నెల 15లోగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనివల్ల రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావం వల్ల ఈనెల 17 వరకు ఉత్తరకోస్తా, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని అధికారులు తెలిపారు. ఇక ఉత్తరాంధ్ర తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ. నుంచి …

Read More »