Breaking News

Tag Archives: Duggirala

శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం

దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా, దుగ్గిరాలనందు శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా జరిగింది. బుధవారం దుగ్గిరాల నుండి విజయవాడ వెళ్ళే మెయిన్‌రోడ్డులో శ్రీ అభయాంజనేయస్వామివారి 42 అడుగుల భారీ విగ్రహం అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ అభయాంజనేయా ట్రస్ట్‌ అధ్యక్షులు జూటూరి శ్రీను మాట్లాడుతూ ఈ దైవ కార్యక్రమాన్ని అందరి సహకారంతో దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నానని, అందరికీ స్వామివారి కృపాకటాక్షాలు కలగాలని ఆకాంక్షించినట్లు …

Read More »

దుగ్గిరాల మండల కేంద్రంలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త : దుగ్గిరాల మండల కేంద్రము రైలుపేట లోని డాక్టర్ వైఎస్ఆర్ గారి విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం నాయకులు కేకే కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సంధర్బంగా రాష్ట్రంలో వైఎస్ జగన్ గారి నాయకత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని, ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని అన్నారు. ఈ …

Read More »

‘ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు’

దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజా వార్త : రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగుతోంది. మూడో రోజు దుగ్గిరాల నుంచి ప్రారంభమైంది. దుగ్గిరాల పట్టణంలో స్థానికులు పూలు చల్లి రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపారు.శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు చేపట్టిన ఈ పాదయాత్ర జయప్రదం కావాలని వారు ఆకాంక్షించారు. పాదయాత్రలో పాల్గొనే రైతులకు పోలీసులు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని.. తమకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పేందుకు మాత్రమే పాదయాత్ర చేస్తున్నట్లు పాదయాత్రలో పాల్గొన్న …

Read More »

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ పాలక వర్గ ప్రమాణస్వీకారం…

దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త : దుగ్గిరాలలో గురువారం జరిగిన దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ పాలక వర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్సీ హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే పాల్గొన్నారు. తొలుత మండలంలోని పలు గ్రామాల్లో భారీ ర్యాలీ నడుమ చైర్మన్ మరియు డైరెక్టర్లు యార్డ్ కు చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మరియు ఎమ్మెల్సీ హనుమంతరావు లు  ప్రసంగిస్తూ రైతులకి పాలక వర్గం అన్నివేళలా అందుబాటులో  ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మండల ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తాం… : ఎమ్మెల్యే ఆర్కే

దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త : దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ నందు ఎమ్మెల్యే ఆర్కే గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే  మాట్లాడుతూ దుగ్గిరాల మార్కెట్ యార్డ్ నుండి రెవిన్యూ వెళుతున్నా సరే నిధుల కొరత ఉందని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. నిధుల కొరత వలన యార్డ్ నందు అవసరమైన అబివృద్ది పనులకు ఆటంకం కలుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని తక్షణమే పై అధికారుల దృష్టికి, మంత్రి కన్న బాబు దృష్టికి, ముఖ్యమంత్రి   జగన్మోహన రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని అన్నారు. …

Read More »