Breaking News

దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తాం… : ఎమ్మెల్యే ఆర్కే

దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త :
దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ నందు ఎమ్మెల్యే ఆర్కే గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే  మాట్లాడుతూ దుగ్గిరాల మార్కెట్ యార్డ్ నుండి రెవిన్యూ వెళుతున్నా సరే నిధుల కొరత ఉందని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. నిధుల కొరత వలన యార్డ్ నందు అవసరమైన అబివృద్ది పనులకు ఆటంకం కలుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని తక్షణమే పై అధికారుల దృష్టికి, మంత్రి కన్న బాబు దృష్టికి, ముఖ్యమంత్రి   జగన్మోహన రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని అన్నారు. ప్రపంచంలో పేరుగల దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ లో లక్షల క్విన్టాళ్ల పసుపు వస్తుందని, ఇందుకు కోల్డ్ స్టోరేజ్ లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని కొందరు రైతులు ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్ లలో పెట్టడం వలన అధిక వ్యయం అవుతుందని అన్నారు. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ అబివృద్ధికి ఎంతగానో కృషి చేసిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును దుగ్గిరాల మార్కెట్ కి పెట్టడానికి ఏక పక్షంగా తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. రానున్న కాలంలో డాక్టర్ వైస్సార్ పసుపు మార్కెట్ యార్డ్ గా మరనున్నదని అన్నారు. ఇందులో భాగంగా పసుపు యార్డ్ మహిళా హమాలీలకు 110 మందికి యూనిఫామలు ఎమ్మెల్యే ఆర్కే  చేతుల మీదుగా అందించడం జరిగింది.

Check Also

కేంద్ర ప్ర‌భుత్వం రూ.1100 కోట్ల వ‌ర‌ద సాయాన్ని త్వ‌ర‌గా అందించాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-కేంద్ర హోం శాఖ‌ మంత్రి అమిత్ షా కు విజ్ఞ‌ప్తి -విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024కు ఆమోదం -విజయవాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *