Breaking News

Daily Archives: May 10, 2026

ప్రధానితో సమావేశం… మాకెంతో ప్రత్యేకం

-తన నివాసానికి ప్రధాని నరేంద్ర మోదీ రావడం… సమావేశం కావడంపై ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మా కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేని, ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే సాయంత్రం ఇది. ఈ రోజు మా నివాసంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి ఆతిథ్యం ఇవ్వడం మాకు లభించిన గొప్ప గౌరవం, సంతోషం. ఆప్యాయత, అనురాగంతో ప్రధాని మాతో గడిపిన ఈ సందర్భం మా అందరికీ ఎంతో ప్రత్యేకం. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు …

Read More »

రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు

-కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం -సీఐఐ బిజినెస్ సమ్మిట్ కు హాజరు కానున్న ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న సీఎం ఉదయం 11.30 గంటలకు హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తోనూ ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం …

Read More »

ప్రధాని నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు తెలియచేస్తూ పవన్ కళ్యాణ్  ట్వీట్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ లోని నా నివాసానికి ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచ్చేయడం గొప్ప అనుభూతిని కలిగించింది. నా సతీమణి అన్నా కొణిదల, మా పిల్లలైన కొణిదల అకీర నందన్, కొణిదల ఆద్య, కొణిదల పోలినా అంజని, మరియు మాస్టర్ కొణిదాల మార్క్ శంకర్‌లతో కలిసి సాదరంగా స్వాగతం పలికే గొప్ప గౌరవం నాకు దక్కింది. నా ఆరోగ్య పరిస్థితి గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి ఆయన సహృదయంతో విచ్చేయడం – ఆయనలోని ఆప్యాయత, అనురాగం, మానవతావాద …

Read More »

కాంగ్రెస్ పార్టీ టీవీకే (తమిళగ వెట్రీ కజగం) పార్టీకి మద్దతు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్న నరేంద్ర మోడీ..

-పొత్తుల పేరుతో మహారాష్ట్ర శివసేన షిండే, ఒడిస్సా నవీన్ పట్నాయక్, బీహార్ నితీష్ కుమార్ లకు వెన్నుపోటు పొడిచి వారిని ముఖ్యమంత్రి పదవులకు దూరం చేసింది బిజెపి కాదా..? -వెన్నుపోటు, పొత్తులు, అధికార దాహం, అక్రమ పొత్తులు, మిత్రపక్షాలకు ద్రోహం, దురాశ అధికారకాంక్ష గురించి నరేంద్ర మోడీ మాట్లాడటం చూస్తుంటే “గురివింద గింజ తన నలుపెరగదంట” సామెత గుర్తొస్తుంది.. -ఎన్.ఎస్.యు.ఐ. స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నరేంద్ర మోడీని సామాన్య కార్యకర్త నుండి గుజరాత్ ముఖ్యమంత్రి చేసిన …

Read More »

వైసీపీ నేతలు ఐదేళ్లు పీకలు కోసి.. ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదం

– రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన జగన్ రెడ్డిని స్వయం ప్రకటిత మేథావులు వెనకేసుకొస్తున్నారు – మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా, ఎన్.ఆర్.ఐ కోటా ప్రకటించింది జగన్ రెడ్డే – రోజూ వేల మంది పేదలకు వైద్యం అందించే ఎయిమ్స్ పట్ల కూడా వివక్ష చూపిన దుర్మార్గుడు జగన్ రెడ్డి – జగన్ రెడ్డి అనే అరాచక శక్తి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జగన్ రెడ్డి అనే అరాచక శక్తిని మహాత్ముడు …

Read More »

నేషనల్ టెక్నాలజీ డే: మే 11న సమతా మూర్తి కేంద్రంలో మొబైల్ ఫోన్లకు అనుమతి!

-జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వెసులుబాటు శ్రీరామనగరం (ముచ్చింతల్), నేటి పత్రిక ప్రజావార్త : సమతా మూర్తి (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) కేంద్రాన్ని సందర్శించే భక్తులకు, పర్యాటకులకు శుభవార్త. మే 11, 2026న జరగనున్న ‘జాతీయ సాంకేతిక దినోత్సవం’ (National Technology Day) పురస్కరించుకుని ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. 1998లో భారతదేశం విజయవంతంగా నిర్వహించిన పోఖ్రాన్ అణు పరీక్షలకు (ఆపరేషన్ శక్తి) గౌరవ సూచకంగా ప్రతి సంవత్సరం మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటాము. …

Read More »

కాణిపాకంస్వామి వారిని దర్శించుకున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్

కాణిపాకం, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి, చిత్తూరు జిల్లాల లో రెండు రోజుల పర్యటనలో భాగంగా కాణిపాకం, విచ్చేసిన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దంపతులు ఆదివారం కాణిపాకం లోని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఉన్నారు. అంతకుమునుపుభారతదేశ గౌ.చీఫ్ …

Read More »

క్రీడలు జీవితంలో ఎలా రాణించాలో నేర్పుతాయి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి క్రీడాకారుడు ఛాంపియన్ కాలేక పోయినా, క్రీడలు జీవితంలో ఎలా రాణించాలో నేర్పుతాయని సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ అన్నారు. స్థానిక ఇందిరాగాంధీ స్టేడియుం లో “యూత్ స్పోర్ట్స్ రిక్రియేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సౌత్ ఇండియా టెన్నిస్ పోటీలలో విజేతలను ఉద్దేశించి ఆయన ఆదివారం ప్రసంగించారు. క్రీడలు జీవితంలో లక్ష్యాన్ని ఏర్పరుచుకోవడానికి, వాటిని సాధించడానికి పట్టుదలతో, క్రమశిక్షణ తో పనిచేసేందుకు దోహద పడతాయని ఆయన అన్నారు. క్రీడాకారులుగా ఎదిగే ప్రతి ఒక్కరూ ఉన్నత …

Read More »

చాత్తాద శ్రీ వైష్ణవులకు కార్పోరేషన్ మంజూరు చేయాలి…

– సంఘ అధ్యక్షులు జె.సత్యనారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చాత్తాద శ్రీ వైష్ణవులకు కూడా కార్పోరేషన్ మంజూరు చేయలని సంఘం అధ్యక్షులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై నిరంతరము అనేక విధముల సహాయం చేయుచున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మా సంఘాన్ని కూడా గుర్తించి ప్రోత్సాహం అందించాలని ఏ విధమైన ప్రగతిలేని చాత్తాద శ్రీ వైష్ణవులను బి.సి. సబ్ ప్లాను …

Read More »

పార్టీ విజయానికి బూత్ లెవల్ ఏజెంట్లే వెన్నెముక : మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 40, 50, 55 డివిజన్ల బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) శిక్షణ తరగతులు మరియు ముఖ్య సమావేశం ఆదివారం స్థానిక బ్రాహ్మణ వీధిలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించి, స్పెషల్ సమ్మరి రివిజన్ మరియు ఏజెంట్లకు ఎన్నికల విధులపై కీలక దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు, పశ్చిమ వైసిపి పరిశీలకులు …

Read More »