Breaking News

నేషనల్ టెక్నాలజీ డే: మే 11న సమతా మూర్తి కేంద్రంలో మొబైల్ ఫోన్లకు అనుమతి!

-జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వెసులుబాటు

శ్రీరామనగరం (ముచ్చింతల్), నేటి పత్రిక ప్రజావార్త :
సమతా మూర్తి (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) కేంద్రాన్ని సందర్శించే భక్తులకు, పర్యాటకులకు శుభవార్త. మే 11, 2026న జరగనున్న ‘జాతీయ సాంకేతిక దినోత్సవం’ (National Technology Day) పురస్కరించుకుని ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. 1998లో భారతదేశం విజయవంతంగా నిర్వహించిన పోఖ్రాన్ అణు పరీక్షలకు (ఆపరేషన్ శక్తి) గౌరవ సూచకంగా ప్రతి సంవత్సరం మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటాము. సైన్స్ మరియు టెక్నాలజీ (శాస్త్ర, సాంకేతిక) రంగంలో మానవాళి సాధించిన అద్భుతమైన ప్రగతిని వేడుకగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో నిర్వహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలకు నాందిగా.. నగరంలో ‘స్పేస్ వాక్’

-విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరంలో ఈ నెల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *