Breaking News

కాణిపాకంస్వామి వారిని దర్శించుకున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్

కాణిపాకం, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి, చిత్తూరు జిల్లాల లో రెండు రోజుల పర్యటనలో భాగంగా కాణిపాకం,
విచ్చేసిన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దంపతులు ఆదివారం కాణిపాకం లోని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఉన్నారు. అంతకుమునుపుభారతదేశ గౌ.చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా శ్రీ గణేష్ కుమార్
కాణిపాకం అతిధి గృహమునందు చేరుకున్నారు, అక్కడ అధికారులు స్వాగతం పలికారు, పోలీసు గౌరవ వందనం స్వీకరించారు, స్వాగతం పలికిన వారిలో చిత్తూరు
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డ్యూడీ, తిరుపతి జాయింట్ కలెక్టర్ ఆర్ .గోవిందరావు, ఆలయ ఈవో పెంచల కిషోర్, చిత్తూర్ ఆర్డీవో శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు, అనంతరం మీడియాతో మాట్లాడుతూ
కుటుంబ ఓటర్లందరికీ ఇది ఒక కొత్త దినం. విజయవంతమైన ఎన్నికల నిర్వహణకు ఇది నూతన ఆరంభంగా భావిస్తున్నాను. ప్రతి ఓటరు ప్రజాస్వామ్య బలోపేతానికి భాగస్వామి కావాలి, అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. నిన్నటి రోజు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నానని, అలాగే ఈరోజు ఉదయం శ్రీకాళహస్తి నందు ఈశ్వరుని దర్శించుకున్నానని, ఈరోజు కాణిపాకం నందు వినాయక స్వామిని దర్శించుకున్నానని తెలిపారు,

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *