Breaking News

కూటమి పాలన రాష్ట్ర యువతకు స్వర్ణ యుగంలా మారింది

-మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి పాలన రాష్ట్ర యువతకు స్వర్ణ యుగంలా మారిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ….కూటమి పాలన రాష్ట్ర యువతకు స్వర్ణ యుగంలా మారింది. రాష్ట్రంలో యువతకు ఓవైపు పెట్టుబడులు, పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ.. మరో వైపు ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీతో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్ విడుదల చేశాం. ఎన్నో ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. ఏ పత్రికలు చూసిన వాటి నిండా ఉద్యోగాల ప్రకటనలే, ఏ ప్రాంతంలో చూసిన యువత ముఖాల్లో చిరునవ్వులే. మెగా డిఎస్సితో 16 వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశాం. దివ్యాంగ బ్యాక్లాగ్, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాం.
ఎన్నికల్లో చెప్పిన విధంగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. ఇది యువ నాయకుడు, మంత్రి లోకేశ్ చిత్తశుద్ధి, కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. గత 5 ఏళ్ళు జగన్ నిరుద్యోగుల్ని నమ్మించి మోసం చేశారు. నాడు జగన్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోగా, రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు తరిమేసి యువతను రోడ్డున పడేశారు. నేడు యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్న
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ స్పూర్తి అభినందనీయమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *