-రోడ్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలి -జలహారతి పనులను మ్యాపింగ్ చేయాలి… -ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రభుత్వ పథకాల లబ్దిని ఉపయోగించుకుని పేద, మధ్య తరగతి కుటుంబాలు అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు తీసుకొస్తున్నామని సీఎం వెల్లడించారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ఆర్టీజీఎస్, వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా …
Read More »Daily Archives: May 12, 2026
సూర్యలంక బీచ్ కు మహర్దశ: మంత్రి కందుల దుర్గేష్
-ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా బాపట్ల సూర్యలంక బీచ్..బాపట్ల తీరానికి అంతర్జాతీయ మెరుగులు: మంత్రి కందుల దుర్గేష్ -స్వదేశీ దర్శన్ 2.0 కింద రూ.97.52 కోట్లతో సూర్యలంక సమగ్ర అభివృద్ధి..ప్రత్యేక కార్యాచరణతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడి..పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్,బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, జిల్లా కలెక్టర్ వినోద్, ఎస్పీ ఉమామహేశ్వరరావు -పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో పర్యాటక రంగ …
Read More »తాలీం-ఏ-హునర్ కు చరిత్రాత్మక స్పందన
-7 వేలకు పైగా దరఖాస్తులతో ముగిసిన నమోదు ప్రక్రియ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తాలీం-ఏ-హునర్ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించిందని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. మొత్తం 7 వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో టాలెంట్ టెస్ట్ ను మే 17న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, …
Read More »ధాన్యం గన్ని బ్యాగుల సమస్యకు త్వరలో ప్రత్యామ్నాయం
-గన్ని బ్యాగుల సమస్యపై త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తాం -బొండాలు రకం ధాన్యం కొనుగోలుకు ఇబ్బంది లేదు -గత ఏడాదితో పోలిస్తే ధాన్యం కొనుగోళ్లు 18% అధికం -18 వేల వాహనాలను జిపిఎస్ సిస్టంతో నుసంధానం -గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల అక్రమాలపై కఠిన చర్యలు -రోజుకు 1.83 లక్షల బుకింగ్స్‌కు 1.89 లక్షల గ్యాస్ సిలిండర్ల డెలివరీ -గ్యాస్ బుకింగ్ చేసిన 4 రోజుల్లో డెలివరీ జరిగేలా చర్యలు -రాష్ట్రంలో 21 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయి -రాష్ట్ర ఆహార …
Read More »అగ్నిప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
-సిబ్బంది కొరత ఉన్నచోట దశల వారిగీ ఖాళీలు భర్తీ చేయండి -హోంమంత్రి వంగలపూడి అనిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర అగ్నిమాపక శాఖ పనితీరుపై హోంమంత్రి వంగలపూడి అనిత సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఫైర్ స్టేషన్లు లేని 22 నియోజకవర్గాల పరిస్థితిపై అధికారులతో చర్చించిన మంత్రి, కొత్తగా ప్రతిపాదించిన 5 ఫైర్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రత్యేకంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమల భాగస్వామ్యంతో ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని …
Read More »ఏపీ గురుకుల విద్యాసంస్థల ప్రవేశ పరీక్షా ఫలితాలను విడుదల
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ గురుకుల విద్యాసంస్థల ప్రవేశ పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరిగిందని ఏపీ గురుకుల విద్యాసంస్థల సంస్థ కార్యదర్శి ఎ. కృష్ణమోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాసంస్థల సంస్థ (APREIS) ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలను విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 24న రాష్ట్రవ్యాప్తంగా APRS CAT-2026, APR JC & DC CET-2026 …
Read More »రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం
– రొయ్యల రైతులపై అదనపు భారం మోపే విధంగా ఫీడ్ ధరల పెంపు సమంజసం కాదన్న మంత్రి – పెంచిన ధరలను వెంటనే నిలిపివేయాలని ఫీడ్ కంపెనీలకు నోటీసులు జారీ – రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ఆక్వా రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా రొయ్యల ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. …
Read More »జైలు శాఖ అధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష సమావేశం
-వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన హోం మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సచివాలయంలో హోం మంత్రి అనిత జైలు శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్షలో వివిధ అంశాలపై చర్చించారు.రాష్ట్రంలో మొత్తం 106 జైళ్లు (ఫంక్షనింగ్ & నాన్-ఫంక్షనింగ్ కలిపి) ఉండగా, అందులో 25 నాన్-ఫంక్షనింగ్ జైళ్ల వివరాలను ప్రత్యేకంగా జాబితా చేయాలని హోం మంత్రి అనిత అన్నారు. ఉపయోగంలో లేని జైళ్లను మరమ్మతులు చేసి ఇతర జైలు కార్యకలాపాలకు వినియోగించే అవకాశాలపై నివేదిక సిద్ధం చేయాలని అన్నారు. …
Read More »ఏపీలో 24 గంటల్లోనే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్
-వాహనదారులకు వేగవంతమైన సేవలే ప్రభుత్వ లక్ష్యం -జాప్యాలకు చెక్ పెట్టేలా కొత్త విధానం అమలు…రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇకపై 24 గంటల్లో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలనే …
Read More »పవన్ కళ్యాణ్ మాటిచ్చారు… కొత్త స్కూలు నిర్మించారు…
–పెదపాడు పాఠశాలకు కొత్త భవనం -అడవితల్లి బాట ప్రారంభోత్సవంలో ఇచ్చిన మాట నిలుపుకొన్న ఉపముఖ్యమంత్రివర్యులు -రూ. 17.50 లక్షలతో భవన నిర్మాణం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అడవితల్లి బాటకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ , ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన పెదపాడు గ్రామ విద్యార్ధుల కోసం నూతన పాఠశాల భవన నిర్మాణానికి ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది. రూ. 17.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన భవనంతో ఆ గ్రామ విద్యార్ధులు, ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకొన్నారు. గత …
Read More »
Prajavartha Online Telugu News