Breaking News

Daily Archives: May 12, 2026

కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపుతుందని వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని, ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందన్నారు. అల్పపీడనం నుండి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. వీటి ప్రభావంతో బుధవారం (13-05-26) …

Read More »

వీధి వ్యాపారులు ఎవ్వరికీ ఆసీలు చెల్లించాల్సిన అవసరం లేదు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వీధి వ్యాపారులు ఎవ్వరికీ ఆసీలు చెల్లించాల్సిన అవసరం లేదని, ఎవరైనా వసూళ్లు చేస్తునట్లు గుర్తిస్తే జిఎంసి కాల్ సెంటర్ 0863-2345103 కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. మంగళవారం నగర కమిషనర్ ఛైర్మన్ గా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో స్ట్రీట్ వెండింగ్ కమిటి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో హోల్ సేల్ పండ్ల మార్కెట్ లో ఆసీలు …

Read More »

అభివృద్ది చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని జంక్షన్లు, ఐలాండ్ లు, పార్కులు, పివికె నాయుడు మార్కెట్లను ఆధునిక వసతులతో ఆకర్షణీయంగా అభివృద్ది చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఏపియుఐఎయంయల్, శ్రీవత్స ఆర్కిటెక్ ప్రతినిధులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపియుఐఎయంయల్), శ్రీవత్స ఆర్కిటెక్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సంధర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరం …

Read More »

కేరళ నర్సుల ప్రత్యేక గుర్తింపు మనం సాధించలేమా

-చిరునవ్వుతో న‌ర్సులందించే సేవలతోనే రోగులకు సాంత్వన -వృత్తి ప‌ట్ల నిబ‌ద్ధ‌త‌పై ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి -వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు – గుంటూరులో ఘనంగా ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డుల ప్రదానం గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రోగుల ఆరోగ్య సంరక్షణలో సిస్టర్స్ (నర్సులు) కీలకంగా వ్యవహరిస్తున్నారు. ‘సిస్టర్’ అనే పదంలో అప్యాయత, ప్రేమ, కరుణ, దయ వంటి లక్షణాలు దాగి ఉన్నాయి. ఇవి తల్లి తన పిల్లలకు అందించే ప్రేమ, అప్యాయతతో సమానం. అందుకే నర్సులను ప్రేమగా సిస్టర్స్ ‘గా …

Read More »

శ్రీ శ్రీ శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర లో డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి శ్రీ శ్రీ శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ తమ సతీమణి శ్రీగౌరీ, సోదరులు వెంకటేశ్వర ప్రసాద్, శివ ప్రసాద్ తో కలిసి కుటుంబసమేతంగా సాంప్రదాయబద్ధంగా సారే ఊరేగింపును నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో సంప్రదాయాలను గౌరవిస్తూ, భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు-కుంకుమ, గాజులు మరియు పండ్లను సమర్పించారు. తిరుపతి నగరంలో …

Read More »

తిరువూరులో చలివేంద్రం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సుపరిపాలన స్ఫూర్తితో, ప్రజాసేవకు ప్రతీకగా నిలుస్తున్న కేడీసీసీ బ్యాంకు చైర్మన్  నెట్టెం రఘురామ్  ఆదేశాల మేరకు కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌, తిరువూరు శాఖ పరిధిలో ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఘనంగా చలివేంద్రం నిర్వహించి ప్రజలకు చల్లని నీరు, మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాన్ని ఎన్‌టీఆర్ జిల్లా జిల్లా రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ ప్రారంభించి ప్రజలకు స్వయంగా చల్లని నీరు, మజ్జిగ అందజేశారు. …

Read More »

రాష్ట్ర అభివృద్ధిపై విషం చిమ్మితే సహించేది లేదు జగన్ రెడ్డీ..

– ఐదేళ్ల పాలనలో అమరావతి రైతులపై చేయని అరాచకం లేదు – ఇప్పుడు రైతులకు అన్యాయమంటూ సరికొత్త డ్రామాకు తెరలేపారు – పేదల ఆస్తుల్ని కొల్లగొట్టిన వైసీపీ నేతలతో కుళ్లు రాజకీయాలు – మూడు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన – కూటమి ప్రభుత్వంపై కుట్రలు చేస్తే సహించేది లేదని హెచ్చరించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యమిస్తూ జరుగుతున్న పాలనను చూసి ఓర్వలేక జగన్ రెడ్డి నీచమైన కుట్రలకు …

Read More »

ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరం : ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ గాయత్రి నగర్, గద్దె గోపాలకృష్ణ స్ట్రీట్‌లో నివసిస్తున్న వృద్ధ దంపతుల ఇంటికి మూడు నెలల క్రితం మంచినీటి కుళాయి కనెక్షన్ తొలగించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ స్పందించారు.ఈ సమస్యపై వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడిన అవినాష్,వృద్ధులకు అత్యవసరంగా మంచినీటి కనెక్షన్ పునరుద్ధరించాలని కోరారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని ఆగ్రహం …

Read More »

న్యూఢిల్లీలో యూరప్ డే వేడుకల్లో పి.బి. సిద్ధార్థ విద్యార్థుల సందడి 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీలో జరిగిన యూరప్ డే (ఐరోపా దినోత్సవం) వేడుకల్లో విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు పాల్గొని సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చినట్లు ప్రిన్సిపాల్ డా. మేకా రమేశ్ తెలిపారు. కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న షూమాన్ డిక్లరేషన్ 76వ వార్షికోత్సవంలో పి.బి. సిద్ధార్థ విద్యార్థులు జిజ్ఞాస ఆర్ట్‌వర్స్ సహకారంతో జానపద నృత్యం (గరగలు) ప్రదర్శించడంతోపాటు జానపద ఆర్కెస్ట్రా కూడా నిర్వహించారు. ఈ సాంస్కృతిక బృందానికి డా.పి.టి.ఎస్.ఆర్.కె. ప్రసాదరావు నేతృత్వం …

Read More »

WB బృందంతో సమావేశాలు

-WB బృందంతో సమావేశాలు నిర్వహించిన APCRDA కమిషనర్ వి. విజయరామరాజు ఐఏఎస్, అడిషనల్ కమిషనర్(FAC) జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ బ్యాంకు(WB) బృందం ప్రజారాజధాని అమరావతి అభివృద్ధి పురోగతిపై సమీక్షించేందుకు 2026 మే 11 నుంచి 12 వరకు 2 రోజులపాటు అమరావతిలో పర్యటించింది. WB ఆర్థిక సహకారంతో అమలవుతున్న రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు బ్యాంకు బృందం పేర్కొంది. రాయపూడిలోని సిఆర్డిఏ ప్రధాన కార్యాలయ ఫస్ట్ ఫ్లోర్ …

Read More »