Breaking News

ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరం : ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ గాయత్రి నగర్, గద్దె గోపాలకృష్ణ స్ట్రీట్‌లో నివసిస్తున్న వృద్ధ దంపతుల ఇంటికి మూడు నెలల క్రితం మంచినీటి కుళాయి కనెక్షన్ తొలగించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ స్పందించారు.ఈ సమస్యపై వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడిన అవినాష్,వృద్ధులకు అత్యవసరంగా మంచినీటి కనెక్షన్ పునరుద్ధరించాలని కోరారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.స్థానిక ఎమ్మెల్యేను పలుమార్లు కలిసి సమస్య వివరించినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోయిందని బాధిత వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా VMC E.E మరియు SE లతో తో ఫోన్‌లో మాట్లాడిన దేవినేని అవినాష్,మానవత్వ దృక్పథంతో వ్యవహరించి వీలైనంత త్వరగా మంచినీటి కనెక్షన్ కల్పించాలని సూచించారు.ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కలపాల అంబేద్కర్,మండల అధ్యక్షులు గద్దె కళ్యాణ్,తుళ్లూరు ఉదయ్,మున్సిపల్ అనుబంధ విభాగం జిల్లా అధ్యక్షులు గొట్టిపాటి హరీష్,8వ డివిజన్ నాయకులు వంశీ,జాన్సీ,రవి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం

-​రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -​గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *