మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సుపరిపాలన స్ఫూర్తితో, ప్రజాసేవకు ప్రతీకగా నిలుస్తున్న కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ ఆదేశాల మేరకు కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, తిరువూరు శాఖ పరిధిలో ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఘనంగా చలివేంద్రం నిర్వహించి ప్రజలకు చల్లని నీరు, మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాన్ని ఎన్‌టీఆర్ జిల్లా జిల్లా రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ ప్రారంభించి ప్రజలకు స్వయంగా చల్లని నీరు, మజ్జిగ అందజేశారు. మండుతున్న ఎండల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమంలో తిరువూరు శాఖ ప్రధాన నిర్వాహకురాలు తాళ్లూరి ఉషాజ్యోతి , సహాయ నిర్వాహకుడు సీహెచ్ అరుణ్, విభాగ పరిధిలోని 38 సంఘాల Ceo లు సిబ్బంది, నాయకులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News