Breaking News

రేపు శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

-నరసన్నపేటలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 9.00 గంటలకు ఉండవల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి 10.40 గంటలకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామ్రపల్లి చేరుకుంటారు. అనంతరం సీఎం నరసన్నపేటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సమావేశంలో పాల్గొంటారు. ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారు. మధ్యాహ్నం 1.20 గంటలకు నరసన్నపేటలోని ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్ దగ్గర ప్రజలతో సమావేశమై స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలపై ప్రజలతో మాట్లాడనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.10 గంటల నుంచి 3.40 గంటల వరకు తామ్రపల్లి గ్రామంలో నిర్వహించే స్థానిక పార్టీ కేడర్ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. 3.55 గంటలకు తామ్రపల్లి నుంచి తిరుగు ప్రయాణమై సాయంత్రం 5.35 గంటలకు ఉండవల్లి క్యాంప్ ఆఫీసుకు చేరుకుంటారు. రాష్ట్రంలో గత 16 నెలలుగా ప్రతీ నెలా 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా పరిశుభ్రత, పర్యావరణం వంటి అంశాల్లో పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *