Breaking News

తాలీం-ఏ-హునర్ కు చరిత్రాత్మక స్పందన

-7 వేలకు పైగా దరఖాస్తులతో ముగిసిన నమోదు ప్రక్రియ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తాలీం-ఏ-హునర్ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించిందని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. మొత్తం 7 వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో టాలెంట్ టెస్ట్ ను మే 17న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, నంద్యాల, తిరుపతి, అనంతపురం కేంద్రాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు మెసేజ్ వచ్చిన వెంటనే హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. పరీక్ష కేంద్రానికి హాల్ టికెట్‌తో పాటు సరైన ఐడీ ప్రూఫ్ తీసుకురావాలని, పరీక్ష సమయానికి గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. తాలీం-ఏ-హునర్ ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నతమైన విద్య కల్పించడం ప్రధాన లక్ష్యమని అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *