Breaking News

ప్రధాని నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు తెలియచేస్తూ పవన్ కళ్యాణ్  ట్వీట్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
హైదరాబాద్ లోని నా నివాసానికి ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచ్చేయడం గొప్ప అనుభూతిని కలిగించింది. నా సతీమణి అన్నా కొణిదల, మా పిల్లలైన కొణిదల అకీర నందన్, కొణిదల ఆద్య, కొణిదల పోలినా అంజని, మరియు మాస్టర్ కొణిదాల మార్క్ శంకర్‌లతో కలిసి సాదరంగా స్వాగతం పలికే గొప్ప గౌరవం నాకు దక్కింది.
నా ఆరోగ్య పరిస్థితి గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి ఆయన సహృదయంతో విచ్చేయడం – ఆయనలోని ఆప్యాయత, అనురాగం, మానవతావాద నాయకత్వాన్ని ప్రతిబింబిస్తునాయి. ఆయనకు తీరిక లేని కార్యక్రమాలు, అపారమైన బాధ్యతలు ఉన్నప్పటికీ, సమయం కేటాయించిన ఇంటికి వచ్చి అండనిచ్చారు. గౌరవ ప్రధాన మంత్రి గారు చూపిన ఈ ఆదరణను ఎంతో విలువైనదిగా భావిస్తాను. ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.

ఏప్రిల్ 19న, నా శస్త్రచికిత్స జరిగిన వెంటనే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా ఫోన్ చేసి నా ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు మరియు ఈ క్లిష్ట సమయంలో నాకు హృదయపూర్వక భరోసా, మద్దతును అందించారు. ఇప్పుడు, నేను కోలుకుంటున్న ఈ సమయంలో, నా నివాసానికి ఆయన రావడం అనేది నేను ఎప్పటికీ గుర్తుంచుకునే సందర్భం.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరినీ తమ కుటుంబ సభ్యుల్లా చూస్తారు. ఆయన తన ఆలోచనలు, చేతలలో ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇదే ఆయన్ని నిజంగా విశిష్టమైన వ్యక్తిగా నిలుపుతుంది. దేశానికి నాయకత్వం వహించే అపారమైన బాధ్యతను మోస్తున్నప్పటికీ, ఆయన కరుణ, వ్యక్తిగత శ్రద్ధ, ప్రజలతో ఆయనకున్న భావోద్వేగ అనుబంధం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.

ప్రధానమంత్రి శ్రద్ధకు, ఆయన సుహృద్భావంతో కూడిన మాటలకు, మాతో గడిపిన విలువైన సమయానికి నేను ఎంతగానో చలించిపోయాను. నరేంద్ర మోదీ అసాధారణ నాయకత్వం, దేశ ప్రగతి పట్ల అచంచలమైన నిబద్ధతకు మించి, ఆయన వినయం, కరుణ, ప్రజలతో ఆయనకున్న వ్యక్తిగత అనుబంధం భారతదేశవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.

ఆయన ఆశీస్సులు, మార్గదర్శనం, ఆప్యాయమైన మద్దతు నాకు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతాయి. ఈ చిరస్మరణీయ పర్యటనకు, ఆయన నిరంతర మార్గదర్శనానికి, ప్రోత్సాహానికి గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *