‘ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు’

దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజా వార్త :
రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగుతోంది. మూడో రోజు దుగ్గిరాల నుంచి ప్రారంభమైంది. దుగ్గిరాల పట్టణంలో స్థానికులు పూలు చల్లి రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపారు.శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు చేపట్టిన ఈ పాదయాత్ర జయప్రదం కావాలని వారు ఆకాంక్షించారు. పాదయాత్రలో పాల్గొనే రైతులకు పోలీసులు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని.. తమకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పేందుకు మాత్రమే పాదయాత్ర చేస్తున్నట్లు పాదయాత్రలో పాల్గొన్న పలువురు రైతులు తెలిపారు. ప్రజలు తమను ఆశీర్వదించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *