Breaking News

తోటమూల గ్రామం లో మెడికల్ క్యాంపునకు విశేష స్పందన ..  


తిరువూరు, నేటి పత్రిక ప్రజా వార్త :
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల భాగంగా బుధవారం  కేశినేని ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం, తోటమూల గ్రామం లో జరిగినటువంటి మెడికల్ క్యాంపునకు విశేష స్పందన వచ్చింది. వివిధ గ్రామాల నుండి క్యాంపునకు 1167  మంది హాజరు అవ్వగా జనరల్ మెడిసిన్ సేవలు 642  మంది వినియోగించుకోగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు 76  మందికి వినియోగించుకోవడం జరిగింది. స్త్రీ మరియు  ప్రసూతి పరీక్షలు 146 మంది వినియోగించుకోవడం జరిగింది. కార్డియాలజీ విభాగంలో 62  మందికి పరీక్షలు చేసి ఈసీజీ లు చేయగా 34  మందికి  2D echo పరీక్షలు  నిర్వహించడం జరిగింది నేత్ర పరీక్షలు 483 మందికి చేయగా 121  మందికి కళ్లజోడులు.. 63 మందికి శుక్లాల ఆపరేషన్ లు. ఈనెల 18వ మరియు ఈనెల 20వ తారీఖున ఉయ్యూరు  రోటరీ హాస్పిటల్ నందు చేయడం జరుగుతుంది. క్యాంప్ నందు  ఉచిత పరీక్షలతోపాటు గా అవసరం అయిన వారందరికీ మందులు కూడా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, అభిమానులు  పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *