ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర జరిగి తీరుతుంది… : గన్నే వెంకట నారాయణ ప్రసాద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి గన్నే వెంకట నారాయణ ప్రసాద్ (అన్న) మాట్లాడుతూ అమరావతి నుండి అరసవల్లి వరకు చేస్తున్న రాజధాని రైతుల పాదయాత్రను సిక్కోలు గడ్డపై అడుగుపెట్టనివ్వబోమని, అడ్డుకుంటామని మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అమరావతి ఏకైక రాజధాని అని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ ముక్తకంఠంతో ఉన్నారని, జగన్ రెడ్డి పాదయాత్ర కు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. గతం లో అమరావతి నుండి దేవస్థానం (తిరుపతి) పాదయాత్రను అప్పలరాజు గుర్తు పెట్టుకోవాలన్నారు. 1000 రోజుల నుండి జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అమరావతి రాజధాని రైతులు వెనకడుగు వేయకుండా పోరాడుతున్నారని, రాజధాని రైతులకు న్యాయదేవత అండగా ఉందన్నారు. అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే రాజధాని రైతుల పాదయాత్ర పై వైసిపి గూండాలు దాడి చేసే ప్రమాదం ఉందనే అనుమానం కలుగుతుందన్నారు. పలాస లో పెట్టిన నాన్ పొలిటికల్ జేఏసీ ఒక భోగస్ జేఏసీ అన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని గత మూడున్నర సంవత్సరాలుగా జగన్ రెడ్డి తెలుగుదేశం నాయకుల పై బురద జల్లిన న్యాయస్థానం అది తప్పుడు ఆరోపణ అని తేల్చిందని, అయినా మీ వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదన్నారు. అమరావతి రాజధాని వల్ల ఒక సామాజిక వర్గానికి లాభం అని చెప్పిన మీ వైసీపీ మాయ మాటలను అమరావతి బహుజన కులాల జేఏసీ భూములు ఇచ్చిన రైతులు లెక్కలవారి గా చెప్పిన విషయం మీకు గుర్తు  రాలేదా అన్నారు. మూడు రాజధానులను అని మాట్లాడే మీ వైసీపీ నాయకులను రాష్ట్ర ప్రజలు బుద్ది చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. అమరావతి రాజధానిని అంగుళం కూడా కదిలించడం మీ తరం కాదన్నారు. సిక్కోలు ప్రజలు రానున్న రోజుల్లో మంత్రి అప్పలరాజు కి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *