శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త : పున్నమి ఘాట్ లో రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు “సీ ప్లేన్” ప్రారంభించి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి అందులో ప్రయాణించి శ్రీశైలానికి విచ్చేశారు. శ్రీశైలం పాతాళగంగలో సురక్షితంగా సీ ప్లేన్” ల్యాండ్ అయ్యింది. ఈ అద్భుత ఆవిష్కరణ వీక్షించిన పాతాళగంగ లోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, తమ హర్షధ్వానాల మధ్య ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత పాతాళగంగ నుంచి రోప్ వే ద్వారా శ్రీశైలం చేరుకొని శ్రీ …
Read More »Tag Archives: srisilam
రాష్ట్ర పర్యాటక రంగంలో అద్భుత ఆవిష్కరణ “సీ ప్లేన్”
-రాష్ట్ర చరిత్రలో తొలిసారి సీ ప్లేన్ పర్యాటకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -మార్చి నుంచి పర్యాటకులకు సీప్లేన్ అందుబాటులోకి తెస్తాం -పర్యాటక రంగానికి ఇండస్ట్రీ హోదా ఇచ్చాం -శ్రీశైలం మాస్టర్ ప్లాన్ కొరకు మంత్రుల మాస్టర్ తో కమిటీ -శ్రీశైలం ప్రెస్ మీట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యాటక రంగ చరిత్రలో “సీ ప్లేన్” ప్రవేశపెట్టడం అద్భుతమైన ఆవిష్కరణ అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …
Read More »మల్లన్న సన్నిధిలో రాష్ట్రపతి ముర్ముకు ఘన స్వాగతం…
శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరియు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధానాలయ రాజగోపురం వద్దకు చేరుకున్న వారికి అర్చకులు, వేదపండితులు మంగళవాయిద్యాల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రత్నగర్భగణపతిస్వామి వారిని, శ్రీ మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని రుద్రాభిషేకం, శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవార్లకు కుంకుమార్చన జరిపించారు. అనంతరం భారత రాష్ట్రపతి, …
Read More »శ్రీశైలంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేక పూజలు
శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు జిల్లా శ్రీశైలంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో శ్రీశైలం చేరుకున్న రాష్ట్రపతికి ఏపీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి శ్రీశైలం ప్రధానాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రత్నగర్భ గణపతి స్వామిని ద్రౌపదీ ముర్ము దర్శించుకున్నారు. అనంతరం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను రాష్ట్రపతి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ అమ్మవారికి …
Read More »మల్లన్నను దర్శించుకున్న ఏపీ హైకోర్టు సీజే
శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జునుడిని ఆదివారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధానన్యామూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా దంపతులు దర్శించుకున్నారు. శనివారం రాత్రి సీజే దంపతులు శ్రీశైలానికి వచ్చారు. ఆదివారం తెల్లవారుజామున స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారికి వేదపండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కలెక్టర్ కోటేశ్వరరావు, ఈవో లవన్న వారికి స్వామివారి శేష వస్త్రాలను, ప్రసాదాలను, స్వామిఅమ్మవార్ల జ్ఞాపికను అందజేశారు. తరువాత జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా దంపతులు శ్రీశైలం ప్రాజెక్టు చేరుకుని మోడల్‌రూమ్‌ను …
Read More »శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు…
శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశైలంలో శుక్రవారం నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్వామివారి గర్భాలయ అభిషేకాలను పూర్తిగా రద్దు చేశారు. రోజూ 4 విడతల్లో ఆర్జిత సామూహిక అభిషేకాలు నిర్వహిస్తారు. మల్లికార్జునస్వామి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. ఈ మాసంలో వచ్చే కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజున పుష్కరిణి వద్ద లక్షదీపార్చన, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జ్వాలాతోరణోత్సవం, కృష్ణవేణి నదీమతల్లికి పుణ్యనదీ హారతులిస్తారు. భక్తులు కార్తీక దీపారాధనను చేసుకునేందుకు వీలుగా …
Read More »ఘనంగా శ్రీశైలంలో ఆషాఢ బోనాలు…
శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం ఆషాఢ బోనాలు ఘనంగా జరిగాయి. శ్రీశ్రీశ్రీ యోగినిమాత సేవాశ్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు క్షేత్ర గ్రామదేవతలలో ఒకరైన మహిషాశురమర్థిని అమ్మవారికి శాస్రోక్త పూజలు నిర్వహించి బోనాలు నైవేద్యంగా సమర్పించారు. సుమారు పది సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు భక్తులు తెలిపారు. బోనం అంటే భోజనం అని, గ్రామం సస్యశ్యామలంగా ఉండేలా వేడుకుంటూ మనస్పూర్తిగా అమ్మవారికి నైవేద్యం సమర్పించే సాంప్రదాయమే బోనాల పండుగ అని గురుమాత శ్రీ యోగినిమాత …
Read More »