శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం ఆషాఢ బోనాలు ఘనంగా జరిగాయి. శ్రీశ్రీశ్రీ యోగినిమాత సేవాశ్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు క్షేత్ర గ్రామదేవతలలో ఒకరైన మహిషాశురమర్థిని అమ్మవారికి శాస్రోక్త పూజలు నిర్వహించి బోనాలు నైవేద్యంగా సమర్పించారు. సుమారు పది సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు భక్తులు తెలిపారు. బోనం అంటే భోజనం అని, గ్రామం సస్యశ్యామలంగా ఉండేలా వేడుకుంటూ మనస్పూర్తిగా అమ్మవారికి నైవేద్యం సమర్పించే సాంప్రదాయమే బోనాల పండుగ అని గురుమాత శ్రీ యోగినిమాత అన్నారు. పుణ్యభూమి అయిన భారత దేశంలో గ్రామదేవతలను కొలుస్తూ ఆషాఢంలో మేళతాళాలతో డప్పు చప్పుళతో అమ్మవారికి ఇచ్చే బోనం ఎంతో పవిత్రమైనదని భక్తులకు వివరించారు. అదే విధంగా క్రిమి కీటకాల వల్ల వస్తున్న వ్యాధులు పూర్తిగా నశించిపోవాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలే గ్రామదేవతలను శాంతింపజేసే ఈ కార్యక్రమం శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల సన్నిధిలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో పాటు శ్రీశైల క్షేత్ర ప్రజలు కూడా బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ డప్పు చప్పుళ్లు మేళతాళాలతో ఆశ్రమం నుండి గ్రామదేవత ఆలయం వరకు జరిగిన ఊరేగింపులో పోతురాజు నృత్యాలలు అందరినీ ఆకట్టుకున్నాయి.
Tags srisilam
Check Also
అన్న క్యాంటీన్ లలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో …