శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జునుడిని ఆదివారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధానన్యామూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా దంపతులు దర్శించుకున్నారు. శనివారం రాత్రి సీజే దంపతులు శ్రీశైలానికి వచ్చారు. ఆదివారం తెల్లవారుజామున స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారికి వేదపండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కలెక్టర్ కోటేశ్వరరావు, ఈవో లవన్న వారికి స్వామివారి శేష వస్త్రాలను, ప్రసాదాలను, స్వామిఅమ్మవార్ల జ్ఞాపికను అందజేశారు. తరువాత జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా దంపతులు శ్రీశైలం ప్రాజెక్టు చేరుకుని మోడల్‌రూమ్‌ను సందర్శించారు.
Tags srisilam
Check Also
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …
Prajavartha Online Telugu News