ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనకు ఏర్పాట్లు…

నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్  కె వి ఎన్ చక్రధర్ బాబు, అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్ లో మరియు వి.పి.ఆర్. ఫంక్షన్ హల్లో జరుగుచున్న ఏర్పాట్లు ను జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులకు తగు సూచనలిచ్చారు. తొలుత పేరేడ్ గ్రౌండ్స్ లో జరుగుచున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీచేశారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నందువల్ల ముఖ్యమంత్రి ని ఆహ్వానించేందుకు వచ్చే ప్రజాప్రతినిధులకు, ప్రముఖులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా బందోబస్తు ఏర్పాట్లులో లోటుపాట్లు లేకుండా చూడాలని అడిషనల్ ఎస్పి  వెంకటరత్నం కు తగు ఆదేశాలిచ్చారు. అనంతరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి వీ పి.ఆర్ ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన కాన్వాయ్ ట్రైల్ రన్ లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్  చక్రధర్ బాబు, వి.పి.ఆర్. ఫంక్షన్ హాల్ ను సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంధర్ ప్రసాద్, నెల్లూరు మునిసిపల్ కమీషనర్ దినేష్ కుమార్, ట్రైనీ కలెక్టర్ ఫర్హాన్ అహ్మద్ ఖాన్, జడ్పీ సి.ఈ. ఓ  శ్రీనివాసరావు, నెల్లూరు, ఆత్మకూరు ఆర్.డి.ఓ లు  హుస్సేన్ సాహెబ్, చైత్ర వర్షిని, తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్  నాగేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పలువురు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *