-కలెక్టర్ల కాన్ఫరెన్స్ నేపధ్యంలో విజన్ డాక్యుమెంట్ ను వివరించిన కలక్టర్ ప్రశాంతి
-జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి కృతఙ్ఞతలు తెలియ చేసిన కలక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజులు పాటు నిర్వహించిన సమావేశంలో రెండో రోజు తూర్పుగోదావరి జిల్లా తరఫున నివేదించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
మౌలిక సదుపాయాలు , సేవా రంగం, పర్యటక అనుబంధ రంగాలు , జాతీయ రహదారులు, నర్సరీ రైతులకి ఉపాధిహామీ పని దినాలు కల్పన , తదితర అంశాలకు చెంది ప్రతిపాదన లపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, ఆమేరకు భవిష్యత్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా సమగ్ర ప్రగతి ప్రథాన నేపథ్యంలో, జివిఏపి ఆధారిత ప్రగతి నేపథ్యం లో ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందన్నారు.
శాశ్వత పరిష్కారం దిశగా ఎర్రకాలువ ఆధునీకరణ, తొర్రిగడ్డ పథకం, ఉపాధిహామీ పథకం కింద 200 నుంచి 400 మంది చిన్న , సన్నకార రైతులకి ఉపాధిహామీ పని దినాలు , కడియం నర్సరీలలో కాఫీ గార్డెన్స్ , కడియం సన్న చిన్నకారు రైతుల కు ఉపాధి హామీ పథకం అమలు, బొబ్బర్లంక – ధవళేశ్వరం రహదారి రెండు లైన్ల రహదారి గా అభివృద్ది , రైల్వే శాఖ ఆధీనంలో ఉన్న భూమి అప్పగింత విషయమై ఉత్తర ప్రత్యుత్తరాలు – హేవలక్ వంతెన పర్యటక కేంద్రం గా, కడియం నర్సరీలలో పర్యాటక అభివృద్ధి , భూసేకరణ కి చెందిన రూ.94 98 కోట్ల బకాయిలు విడుదల , వైట్ ఫీల్డ్ పేపర్ మిల్లు భూములను సెజ్ కి కేటాయింపు, పెండింగ్ లో ఉన్న వితంతు పింఛన్ల జారీ , కొవ్వూరు సి హెచ్ సి నీ 50 నుంచి 150 బెడ్స్ ఆసుపత్రి గా అప్ గ్రేషన్ ,గోదావరీ పుష్కరాలు నేపథ్యం ప్రత్యేక అధికారుల నియామకం తదితర 11 ప్రతిపాదనలు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆమోదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. జిల్లా తరపున ప్రతిపాదించిన అంశాలకి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి,ఆమోదించడం పట్ల జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు వ్యక్తం చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేసారు.
సిఎం ఆమోదించిన అంశాల వారీగా జిల్లా తరపున ప్రతిపాదించిన సమగ్ర వివరాలు:
ఎర్రకాలువ పనులకు సంబంధించి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని రూ.295 కోట్ల 30 లక్షల అంచనాతో గోపాలపురం, నిడదవోలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో 20,250 క్యూసెక్కుల డిజైన్ డిశ్చార్జి కోసం ఎర్రకాలవ నది కుడికాలువ మరియు ఎడమ ఒడ్డు మరియు నిర్మాణాల కోసం KM 0.00 కి మీ నుండి 33.390 కీ మీ వరకు శాశ్వత పునరుద్ధరణ కోసం ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. ఎర్రకలవ నది డిజైన్ డిశ్చార్జి ఖరారు కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు కోసం వేచి ఉంది మరియు మరింత ముంపునకు గురికాకుండా నివారణ చర్యలను తీసుకోవాలని కోరడం జరిగింది.
ఈ క్రమంలో సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి ఈ విషయమై ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి, తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రథాన కార్యదర్శి కి సూచించడం జరిగిందన్నారు.
కడియం మండలంలో నర్సరీల పెంపకానికి, అభివృద్ది పనులను ఉపాథి హామీ పథకం ద్వారా అవకాశం కల్పించాలని , అక్కడ ఉపాథి అవకాశాలు పొందుతున్న 200 నుంచి 400 మంది చిన్న, సన్నకారు రైతులకు ఆర్ధిక లబ్ధి, జీవనభృతి చేకూరనుందని వివరించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఒక ఎకరం నర్సరీ పెంపకానికి దాదాపు 570 రోజుల ఉపాధిహామీ పనిదినాలు కల్పించే అవకాశం ఉంటుందని వివరించారు. తద్వారా చిన్న సన్నకార రైతులకు ఆదాయం వస్తుందని, కడియం నర్సరీలు మరింత సమర్థవంతంగా అభివృద్ది చెందే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ విషయమై తగిన పరిపాలనా పరమైన ఉత్తర్వులు జారీ చెయ్యాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. జిల్లాలో పలు చిన్న చిన్న ప్రాజెక్టు లని పీ -4 కింద చేపట్టనున్నట్లు కలెక్టర్ వివరించడం జరిగింది.
తొర్రి గడ్డ కాలువ కు ఆకస్మిక వరదలు కారణంగా ఎదుర్కుంటున్న ఇబ్బందులను అధిగమించేలా జల వనరుల శాఖ ఆధ్వర్యంలో రూ.91 కోట్ల అంచనా తో రెండు సార్లు నాన్‌లైన్ టెండర్ల ఆహ్వానించినట్లు మరియు ఏ ఏజెన్సీలు కూడా ప్రాజెక్ట్ బిడ్‌లలో పాల్గొనలేదన్నారు. మూడోసారి టెండర్ల ప్రక్రియ కోసం అనుమతించాలని కలక్టర్ కోరడం జరిగింది. ఈ విషయమై సిఎం ఆదేశాల మేరకు 3 వ సారి టెండర్ పిలవడం కోసం ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు.
కొవ్వూరు పట్టిసీమ గోదావరీ లెఫ్ట్ కెనాల్ రోడ్డు , బొబ్బర్లంక – ధవళేశ్వం రెండు లైన్ల 22 కిమి రహదారి నిర్మాణ పనుల కోసం రూ.48 కోట్ల తో ప్రతిపాదించినట్లు తెలిపారు, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు
పర్యాటక శాఖ, ప్రభుత్వానికి అనుకూలంగా రాజమండ్రి వద్ద హేవ్‌లాక్ వంతెన వద్ద ఉన్న భూమి బదిలీకి ప్రతిపాదన, టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ పర్యటక శాఖ ఆధ్వర్యంలో చొరవ చూపినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖ ఆధీనంలో ఉన్న 1044 గజాల స్థలానికి రైల్వే శాఖ కోరిన విధంగా రూ.12.50 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. కానీ సదరు స్థలం అప్పగించడం జరుగలేదని వెల్లడించారు. రైల్వే శాఖతో భూ మార్పిడి కోసం చెల్లింపులు జరిపిన దృష్ట్యా 1044 చదరపు గజాల మేరకు భూమిని స్వాధీనం చేసుకునేలా రైల్వే శాఖ ను సంప్రదించాలని సూచించారు. వెంటనే స్వాధీనం చేసుకుని పర్యటక పరంగా అభివృద్ది పనులు చేపట్టాలన్నారు.
ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల కోసం కొత్త వితంతు పింఛన్లు మంజూరు చేయడం కోసం అర్జీలు రావడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. డిసెంబర్ 2024 నుండి కొత్త పెన్షన్ లు మంజూరు చేశారని, అయితే నవంబర్ 2024 కంటే ముందు మరణించిన వారి వితంతు పింఛను దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కాబట్టి నవంబర్ 2024 కంటే ముందు తమ భర్తలను కోల్పోయిన మహిళలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కలెక్టర్ పి ప్రశాంతి కోరడం జరిగింది. ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
హౌసింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా భూ సేకరణలో సేకరించిన భూ యజమానులకు బకాయి పెట్టిన రూ.94 కోట్ల 98 లక్షలను చెల్లింపుల కోసం విడుదల చేయాలని కలెక్టర్ కోరడం జరిగింది. నిధుల విడుదల చెయ్యడం కోసం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
అఖండ గోదావరి ప్రాజెక్టు , 2027 గోదావరీ పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక అధికారులను నియమించాలని కోరడం జరిగిందన్నారు. ఈ విషయమై స్పందించిన ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రత్యేక అధికారులుగా సీనియర్ ఐ ఎ ఎస్ అధికారులు జి. వీర పాండ్యన్, వి. విజయరామరాజు లని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు.
Prajavartha Online Telugu News