Breaking News

“మార్గదర్శిగా ముందుకు రండి – బంగారు కుటుంబాల నిర్మాణంలో భాగస్వాములు కండి”

క్షేత్ర స్థాయిలో మార్గదర్శకుల గుర్తింపు వేగవంతం చెయ్యాలి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నియోజక వర్గ హెడ్ క్వార్టర్ తహసిల్దార్ , ఎంపిడివో లతో శనివారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి ప్రశాంతి సమీక్ష రాష్ట్రంలో ఆర్థిక సమానత్వం సాధన లక్ష్యంగా ప్రజలు, ప్రభుత్వం , ప్రవేటు భాగస్వామ్యం తో పి – 4 “మార్గదర్శి – బంగారు కుటుంబాలు” కార్యక్రమం చేపట్టడం జరిగిందని , ఆ దిశలో జిల్లా పరిధిలో మార్గదర్శుల గుర్తింపు వేగవంతం చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజికంగా వెనుకబడిన కుటుంబాలను గుర్తించి , బంగారు కుటుంబాలుగా ఎదగాలంటే వారికి సరైన దిశలో మార్గనిర్దేశం చేయడం, మనోధైర్యం కలిగించేలా ప్రోత్సహించడం అవసరం అన్నారు. జీవితంలో ఎదగాలంటే తోడు నిలిచే వారు అవసరం అన్నారు. విద్య, ఉద్యోగం, జీవనోపాధి కల్పన వంటి విషయాల్లో సహాయం చేస్తూ పక్కన ఉండే వ్యక్తుల ద్వారా తోడ్పాటు వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నారు. ఆమేరకు తోడ్పాటు అందించేందుకు, స్వచ్ఛంద మార్గదర్శులు ముందుకు రావాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి పిలుపునిచ్చారు. ఆసక్తి కలిగిన వారు ఉన్నా ఎలా దత్తత తీసుకోవచ్చు? అనే విషయం లో కొన్ని విషయాలపై అవగాహన కల్పించడం ముఖ్యం అన్నారు. ఒక మార్గదర్శి ఒక కుటుంబాన్ని, లేదా మరిన్ని కుటుంబాలను బంగారు కుటుంబాల కింద దత్తత తీసుకోవచ్చు అన్నారు.
సామర్థ్యం ఉన్నవారు ఎక్కువ మందిని దత్తత తీసుకునే దిశలో మార్గనిర్దేశం చేయవచ్చు అని స్పష్టం చేశారు. అటువంటి వ్యక్తులు ద్వారా విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందేలా మార్గదర్శనం చేయవచ్చు అన్నారు.
ఈ క్రమంలో ప్రత్యేకంగా అధికారుల పాత్రకు చాలా కీలకం అని కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలలో ఉన్న అధికారులు నిష్ఠతో పనిచేసి, మార్గదర్శుల గుర్తింపు, కుటుంబాల ఎంపిక, క్షేత్ర స్థాయిలో వేగవంతంగా జరగేలా నియోజక వర్గ స్థాయిలో ఉన్న ఇతర అధికారులతో సమన్వయం, స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం చేయాలని సూచించారు. తాను ఒక కుటుంబాన్ని పి 4 ద్వారా దత్తత తీసుకున్నట్లు, ప్రతి అధికారి, ఉద్యోగులు తమ వంతుగా ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని, వారి సమగ్ర అభివృద్ధి కోసం తమ వంతుగా సహకారం అందించాలని కోరారు.  P.4 సర్వేపై నియోజక వర్గ స్థాయిలో సమీక్ష నిర్వహించి, ఆ మేరకు కార్యాచరణ వేగవంతం చేయాలన్నారు.. ఆగస్టు 5 వ తేదీ నాటికి ఈ విషయంలో ఒక స్పష్టత రావాలని పిలుపు ఇచ్చారు. అసెంబ్లీ ప్రధాన కేంద్రాల తహసీల్దార్లతో P.4 సర్వే ఆధారంగా మార్గదర్శుల దత్తతకు తగిన కుటుంబాలను గుర్తించి, ఫీల్డ్ స్థాయిలో మరింత స్పష్టంగా పనిచేయాలని ఆదేశించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు సమక్షం లో , ప్రతి మండలంలో పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఉద్యోగులు, ఐటీ నిపుణులు, ప్రముఖులను గుర్తించి, మార్గదర్శుల సామర్థ్యానికి అనుగుణంగా వారికి బంగారు కుటుంబాలను మ్యాపింగ్ చేయాలన్నారు. ఒక మార్గదర్శి కనీసం ఒక బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకొని ఆ కుటుంబం యొక్క భవిష్యత్తుకు వెలుగు చూపడంలో భాగస్వాములవ్వడం పి 4 యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఆర్ధిక అసమానతులు లేని సామాజిక దృక్పథంతో బంగారు కుటుంబాల నిర్మాణానికి మార్గదర్శులు తోడుగా నిలవాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయం, వాటిని సఫలీకృతం అయ్యే విధంగా కలిసి అడుగులు వేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎల్ అప్పల కొండ, ఆర్డీవోలు ఆర్ కృష్ణ నాయక్ , రాణి సుస్మిత, తహశీల్దార్లు , ఎంపిడివో లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేటి పత్రిక ప్రజావార్త :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *