Breaking News

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రతి వైద్య అధికారి, సిబ్బంది జవాబుదారీతనం కలిగి ఉండాలి

–  జిజిహెచ్‌లో క్యాన్సర్ రోగుల ప్రత్యేక వైద్య సేవలు
–  జిజిహెచ్ లో అంకాలజీ విభాగం ద్వారా వైద్య సేవలు అందుబాటులో
–  కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా వైద్యాధికారులు పరస్పర సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. గురువారం ఉదయం రాజమహేంద్రవరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, వైద్య పరికరాల స్థితి, సిబ్బంది భర్తీ, నిర్మాణ పనుల పురోగతి తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఆసుపత్రి పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, తాగునీటి సదుపాయాలు, రోగుల కోసం వేచిచోట్ల సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై కూడా దృష్టి సారించాలన్నారు..“ప్రజల ఆరోగ్యమే పరమావధిగా వైద్య సేవలు అందించే క్రమంలో ప్రతి వైద్యుడు ప్రజల కోసం పనిచేస్తున్నా మనే భావనతో బాధ్యతగా విధులను నిర్వహించా లన్నారు. జిజిహెచ్‌లో క్యాన్సర్ అనుబంధ వైద్య సేవలు విభాగంలో అంకాలజీ విభాగం ద్వారా రోగులకు సమగ్ర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ విభాగంలో ప్రత్యేక స్పెషలిస్ట్ వైద్యులు రోగులకు క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స, కౌన్సెలింగ్ మరియు ఫాలో-అప్ సేవలు అందిస్తున్నారు. ప్రజలకు ఈ సేవల గురించి అవగాహన కల్పించడం, అవసరమైన వ్యక్తులు సత్వరమే ఈ సౌకర్యాన్ని పొందేలా చేయడం ముఖ్యమని కలెక్టర్ సూచించారు. రాజమహేంద్రవరం జిజిహెచ్‌లో మొత్తం 484 పోస్టులు మంజూరై, 326 పోస్టులు భర్తీ కాగా, 158 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఖాళీగా ఉన్న పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్ పోస్టులను నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రిలో ఇప్పటికే పూర్తయిన ఎంసిహెచ్, కంటి, మైక్రో బయాలజీ విభాగాల భవన విస్తరణలలో నాణ్యమైన సేవలు అందించాలన్నారు. 50 పడకలతో నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ బ్లాక్‌ పనులు 75 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకుని రావాలని, సమాంతరంగా అవసరమైన వైద్య పరికరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మార్చురీ విభాగంలో ప్రస్తుతం ఫ్రీజర్లు లేని కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నందున తక్షణ చర్యలు తీసుకోవాలని, మార్చురీ సమీపంలో టాయిలెట్లు కూడా నిర్మించాలని కలెక్టర్ సూచించారు. పీడియాట్రిక్స్ విభాగంలోని ఎస్‌.ఎన్‌.సీ.యూ లో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లను నియమించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పల్మనాల జిస్టును జిజిహెచ్‌కి డిప్యూట్ చేయాలని డీఎంహెచ్ఓకి సూచించారు. అలాగే డెర్మటాలజీ విభాగంలో ఓపి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పీజీ స్పెషలిస్టు త్వరిత గతిన నియామకం చేయాలని ఆదేశించారు. బ్లడ్ బ్యాంకు ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో పనిచేస్తూ, రక్త నిల్వలు సమృద్ధిగా ఉండేలా చర్యలలో భాగంగా విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు తక్షణ సేవలు అందించేలా చొరవ చూపాలని, అందులో భాగంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఇన్‌పేషెంట్ రోగులకు అందించిన చికిత్స వివరాలను ఎప్పటి కప్పుడు నిర్ణిత సమయంలో గా ఎన్టీఆర్ వైద్య సేవా పోర్టల్‌ లో అప్లోడ్ చేయాలన్నారు. తద్వారా లభించే ప్రోత్సాహక నిధుల వల్ల ఆసుపత్రి అభివృద్ధి పనులకు వినియోగించవచ్చని ఆమె తెలియ చేశారు. మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రతి విభాగం తమ సిబ్బంది వివరాలు, వైద్య పరికరాలు, మౌలిక వసతులు కల్పన, అవసరమైన మందులు తదితర అంశాలపై నివేదికలు సమర్పిస్తే వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు, ఇతర అనుబంధ కార్యకలాపాలు పై రాష్ట్ర ప్రభుత్వం ఐ.వి.ఆర్.ఎస్‌ (IVRS) ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్న నేపథ్యంలో, అందిన సూచనల ఆధారంగా సేవల నాణ్యతను మరింత మెరుగుపరచేందుకు వైద్యాధికారులు కృషి చేయాలని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిజిహెచ్ సూపరింటెండెంట్‌ డా బి. సౌభాగ్య లక్ష్మీ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎస్..భాస్కర్‌ రెడ్డి, వివిధ వైద్య విభాగాల హెచ్‌ఓడీలు, వైద్యులు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నగరంలో శ్రీవిద్య లగ్జరీ షోరూమ్ ప్రారంభం

విజయవాడ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *