Breaking News

గుడివాడ ప్రభుత్వ ఐటీఐలో వివిధట్రైడుల్లోని సీట్లు భర్తీకి సంబందించి మూడవ విడత కౌన్సిలింగ్ కు దరఖాస్తులు ఆహ్వానించడమైనది…

-ప్రిన్స్ పాల్ వి. శ్రీనివాసరాజు

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2021-22 విద్యా సంవత్సరానికి గాను గుడివాడ కె.బి.ఆర్. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ)లో వివిధ ట్రేడులలో ఖాళీ ఉన్న సీట్ల ప్రవేశానికి సంబందించి మూడవ విడతలో ఈనెల 11 వ తేదీ నుంచి 26 వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించడమైనదని గుడివాడ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్స్ పాల్ వి. శ్రీనివాసరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేబిఆర్ ప్రభుత్వం ఐటిఐలో చేరు అభ్యర్థులు https://iti.nic.in ద్వారా తమ దరఖాస్తులను 26.10.2021 సాయంత్రము 5 గంటల లోపు పూర్తి చేసుకోగలరని తెలియజేయుచున్నారు. కావున ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తును https://iti.nic.in ద్వారా నమోదు చేసుకోవాలని లేదా ప్రభుత్వ ఐటిఐ వారిని సంప్రదించాలన్నారు.
సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ 27.10.2021 వరకు ఉంటుందని, కౌన్సిలింగ్ తేది.29.10.2021 తేదీన జరుగునని వారు ఆ ప్రకటనలో తెలిపారు. ఇతర వివరములకు 08674-295953 ఫోన్ నంబరుకు పోన్ చేసి వివరము తెలుసుకోగలరని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేటి పత్రిక ప్రజావార్త :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *