Breaking News

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జగనన్న ప్రభుత్వం పనిచేస్తుంది : హోంమంత్రి తానేటి వనిత

– దెందులూరు మండలం కొవ్వలి ఘనంగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ, భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..
– ముఖ్యఅతిథిగా హాజరైన హోంమంత్రి తానేటి వనతి
– పాల్గొన్న ఎమ్మెల్సీ పండుల రవీంద్ర, ఎమ్మెల్యే కోఠారు అబ్బయ్య చౌదరి, జిల్లాపరిషత్ చైర్మన్ ఘంటా పద్మశ్రీ

దెందులూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ్యాంగ నిర్మాత డా. బీ.ఆర్. అంబేద్కర్, డా. బాబూ జగజ్జీవన్ రామ్ వారి ఆశయాలకు అనుగుణంగా సమాజంలో సమానత్వం కోసం జగనన్న ప్రభుత్వం కృషి చేస్తోందని, రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తోందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామం దళితవాడలో ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన డా. బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు, గ్రామ కచేరి చావడి ప్రారంభోత్సవాలకు హోంమంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ దినోత్సవం రోజున డా. బీ.ఆర్. ఆంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ తమ చేతులుమీదుగా జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. నవంబర్ 26న దేశ వ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం జరుగుతుంటే.. కొవ్వలి గ్రామంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణతో రెండు పండుగలు జరుగుతున్నాయన్నారు. సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడం కోసం డా. బీఆర్ అంబేద్కర్, డా. బాబూ జగజ్జీవన్ రామ్ వంటి మహనీయులు అహర్నిశలు కృషిచేశారన్నారు. అంబేద్కర్ కృషి ఫలితంగానే ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం రూపుదిద్దుకుందన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారతరాజ్యాంగం ఉన్నత విలువలు కలిగిందంటూ మన్ననలు కూడా పొందిదన్నారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులతోనే దళితులకు, బడుగు బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగ, రాజకీయం ఇలా అన్ని రంగాల్లో అవకాశాలు లభించాయన్నారు. రాజ్యాంగ స్పూర్తిగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారన్నారు. దళిత మహిళలైన తమకు రాష్ట్ర హోంమంత్రి పదవి ఇచ్చారన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్పూర్తితో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు అని ముఖ్యమంత్రి జగన్ దళిత, బలహీన వర్గాలకు సముచిత రాజకీయ స్థానం కల్పించారన్నారు. మహిళలకు కూడా చేయూత వంటి పథకాలతో మహిళా సాధికారత వైపు పయనిస్తున్నారన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంతగా.. ప్రతి వర్గానికి అండగా ఉంటూ దళిత వర్గాల ఉన్నతికి జగనన్న ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో 70 శాతం మందిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అవకాశం కల్పించి సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అలాగే కేబినెట్ లో ఐదుగురు దళితులకు స్థానం కల్పించారని.. కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవి (కె. నారాయణస్వామి), శాసన మండలి ఛైర్మన్ (కొయ్యే మోషేన్ రాజు), హోంమంత్రి (మేకతోటి సుచరిత, తానేటి వనిత), పురపాలక శాఖ మంత్రి (ఆదిమూలపు సురేష్), రవాణా (పినిపే విశ్వరూప్), సాంఘిక సంక్షేమ శాఖ (మేరుగు నాగార్జున), ఎక్సైజ్‌ వంటి శాఖలను దళితులకు కేటాయించారని తెలిపారు. దళితులకు, బడుగు బలహీనవర్గాలకు తోడుగా నిలిచిన ముఖ్యమంత్రికి వారంతా అండగా ఉండాలని ఆమె కోరారు. భవిష్యత్ లో కూడా ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని హోంమంత్రి తానేటి వనిత కోరారు. ఈ కార్యక్రమానికి ముందుగా కొవ్వలి గ్రామంలో గాంధీనగరం పెట్రోల్ బంక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి హోంమంత్రి తానేటి వనిత పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం జై బీమ్ యూత్ ఆధ్వర్యంలో దాదాపు 2 కి.మీ. మేర బైక్ ర్యాలీతో డప్పులతో, బాణా సంచాతో హోంమంత్రికి ఘనస్వాగతం పలుకుతూ దళితవాడకు తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ పండుల రవీంద్ర తమ దృష్టికి తీసుకొచ్చిన గ్రామ సమస్యలపై తగిన న్యాయం చేసేందుకు కృషి చేస్తానని హోంమంత్రి తానేటి వనిత హామీ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేటి పత్రిక ప్రజావార్త :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *