Breaking News

మత్స్యకారుల కుటుంబాల జీవనోపాధి పెంచడమే ప్రభుత్వ లక్ష్యం

-మత్స్య సంపదకు  మార్కెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది.
-ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు
-పలువురు మత్స్యకారులను ఘనంగా సన్మానించిన కలక్టర్
-గోదావరి నదిలోకి విడుదల చేసిన 35 లక్షల చేప పిల్లలు
-కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
మత్స్యకార కుటుంబాల జీవనోపాధి ప్రమాణాలను పెంచే దిశగా వారిలో సాంకేతిక కూడిన వృత్తి నైపుణ్యాన్ని పెంచి, మత్స్య సంపదకు మార్కెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం ఉదయం ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ సమీపంలో కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులతో కలిసి 35 లక్షల చేప పిల్లలను గోదావరి నదిలో వదిలారు.

తొలుత కలెక్టర్ పి ప్రశాంతి మత్స్యకారుల సంఘాల ప్రతినిధులు, మత్స్యకారులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ మత్స్యకారుల కుటుంబాల జీవన ప్రమాణాలను పెంపొందించే దిశగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే కార్యక్రమాలను చేపట్టాలన్నది ముఖ్య ఉద్దేశమన్నారు. మత్స్య సంపద ను పెంచేందుకు మన రాష్ట్రంలో వున్న వనరులను సద్వినియోగం చేసుకోవా లన్నారు. మత్స్య సంపదను పెంపొందించే దిశగా పారిశ్రామిక అభివృద్ధి కోసం , ఆక్వా సంబంధిత పరిశ్రమలు, మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు ఆధారిత వాటిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. మత్స్యకారుల్లో వృత్తి నైపుణ్యం పెంచే విధంగా చర్యలు చేపట్టాలన్నారు .

మత్స్యకారులు వేటాడి తీసుకొచ్చిన మత్స్య సంపదను మెరుగైన ఫలితాలు సాధించే విధంగా అప్గ్రేడ్ చేస్తూ మార్కెట్ సౌకర్యాన్ని కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆయా విద్యా సంవత్సరంలో కొంత మంది విద్యార్థులకు ఆక్వా ఉత్పత్తుల పట్ల మరిన్ని మెళకువులను నేర్పాల్సిన అవశ్యకత ఉందన్నారు. మత్స్యకారులకు అందుబాటులో ఉన్న మత్స్య శాఖా పరంగా చేపట్టిన కార్యక్రమాలు, మత్స్య అభివృద్ధిలో విద్యార్థులు, ఎడ్యుకేషన్ కమ్యూనిటీ, పరిశోధన కేంద్రాల సామర్ధ్యతను పెంచుకుంటూ వెళుతున్నామన్నారు. గతంలో సహజ సిద్ధంగా మాత్రమే మత్స్యకారులు వేటాడే వారన్నారు. నేడు విడుదల చేసిన 35 లక్షల చేప పిల్లలు మరో ఆరు నెలల్లో మత్స్యకారులు వేటాడేందుకు చేపలు అందుబాటులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. మత్స్య సీడ్స్ తయారు చేసేందుకు 4, 5 నెలలు ముందు నుండే మత్స్య శాఖ చేప పిల్లల ఉత్పత్తి ప్రక్రియను ప్రారంభిస్తుందన్నారు. మత్స్య సంపదను మార్కెట్ కు అనుగుణంగా స్టోరేజ్ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. మత్స్యకారుల పిల్లలు సంప్రదాయ వృత్తి పారిశ్రామిక వైపు దృష్టిని సారిస్తూ ఎదగాలన్నారు. విదేశాల్లో డ్రై ఫిష్ కు చాలా డిమాండ్ ఉందని అందుకు అనుగుణంగా మన మత్స్య ఉత్పత్తులను మార్కెట్ సామర్ధ్యాన్ని పెంపొందించుకునే సోలార్ డ్రై దిశగా అవకాశాలను మెరుగుపరుచు కోవాలన్నారు.

జిల్లా మత్స్యశాఖ అధికారి వి.కృష్ణారావు మాట్లాడుతూ సుస్థిరమైన మత్స్య సాగు, రోజురోజుకు తగ్గుతున్న తరుణంలో సహజ వనరుల్లో మత్స్య సంపదను ఏ విధంగా కాపాడుకోవాలనే మెలకువలు నేర్చుకోవాలి అన్నారు. రోజురోజుకు వాతావరణం లో వస్తున్న మార్పులకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుని నూతన సాంకేతిక మెలకువలు నేర్చుకోవడం ద్వారా మన జీవనోపాధికి అవసరమైన మత్స్య సంపదను కాపాడుకోవచ్చునని ఆయన అన్నారు. ప్రతి ఏడాది నవంబర్ 21వ తేదీన మత్స్యకారుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పలువురు మత్స్యకారులను ఘనంగా సన్మానించినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా.ఆర్ట్స్ కళాశాల M. Sc Aquaculture and Zoology, B. Voc Commercial Aquaculture విద్యార్థులు చదువు తో పాటుగా ఫీల్డ్ లో చేపపిల్లల ఉత్పత్తి మరియు పెంపకం లో శిక్షణ పొందిన 75 మంది విద్యార్థులకు ధ్రువపత్రాలను కలెక్టర్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి వి.కృష్ణారావు, తాహసిల్దార్ పి వి కుమార్, ఎంపీడీవో శ్రీనివాసరావు, డి ఎఫ్ సి ఎస్ ఎం.సత్తిబాబు,ఆర్ట్స్ కళాశాల ఫాకల్టీ కె. దుర్గారావు, రవితేజ, రఘువీర్, విద్యార్థులు, మత్స్యకార సంఘాలు ప్రతినిధులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *