విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సహకారంతో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆనందయ్య మందును విజయవాడ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులకు పంపిణీ చేశారు. ఏపీయూడబ్ల్యూజే అర్బన్ అధ్యక్షులు చావా రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆనందయ్య మందు మూడోసారి పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ మందు వాడటం వల్ల ప్రతి ఒక్కరిలోనూ కరోనాని ఎదుర్కోగలమనే ఒక బరోసా పెరిగిందన్నారు. కరోనా విపత్కర పరిస్థితులలో జర్నలిస్టులకు ఎమ్మెల్యే గోవర్ధన రెడ్డి సహకరించడం ఎంతో హర్షణీయమన్నారు. ఏపీయూడబ్ల్యూజే నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆనందయ్య మందుకు తొలుత ప్రాచుర్యంలోకి రావడంతో ఆనందయ్య కూడా జర్నలిస్టులకు మందు పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలియజేశారు. విజయవాడ అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …