Breaking News

ప్రజా స్వామ్యాన్ని ఖూనీ‌ చేసేలా అధికార పార్టీ నేతల తీరు ఉంది…

-నిన్న కౌన్సిల్ హాలులో ప్రతిపక్ష సభ్యులు గొంతు నొక్కాలని చూడటం దుర్మార్గం…
-టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శుక్రవారం  మొగల్రాజపురం లోని ఇంటివద్ద నిన్న విఎంసి కౌన్సిల్ లో టీడీపీ కార్పొరేటర్ల అక్రమ అరెస్ట్ పై విలేకర్ల సమావేశం జరిగింది. ఈ విలేకర్ల సమావేశంలో బోండా ఉమా మాట్లాడుతూ కౌన్సిల్ లో ప్రజాస్వామ్యం కూనిచేసే విదంగా రాజ్యాంగము కల్పించే హక్కులను తుంగలో తొక్కుతూ కార్పొరెటర్లను అక్రమంగా అరెస్ట్ చేశారు అన్నారు. విఎంసి కౌన్సిల్ లో అవాంఛనీయసంఘటనలు జరిగి పిర్యాదు చేస్తే తప్ప పోలీసులు రావడానికి లేదు అన్నారు. గతంలో వైసీపీ ప్రతిపక్షములో ఉన్నప్పుడు తెల్లవార్లు కౌన్సిల్ బయట బైఠాయించిన విషయం మరిచారా అని ప్రశ్నించారు. ఎక్కువ అప్పులు కోసం కేంద్రం చెప్పినట్లుగా ప్రజలపై పెద్ద ఎత్తున ఇంటి పన్నులు వసూలు చేసేందుకు సిద్ధం కావడంతో ప్రజలపై భారం పడుతోంది అని, ప్రభుత్వం తీసుకొచ్చే జి.ఓలను ప్రతిపక్ష పార్టీగా వ్యతిరేకించాం అన్నారు. విజయవాడలో ఎక్కడవేసీన గొంగలి అక్కడే అన్నట్లుగా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అని అన్నారు. ఆస్తి పన్నుల పెంపు జి.ఓలపై ప్రజాభిప్రాయసేకరణలో విజయవాడలో 8 లక్షలు మంది ఈ జి.ఓ లను వ్యతిరేకించారు అని గుర్తు చేశారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అని, ఇటువంటి సమయంలో పన్నులు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. కౌన్సిల్ లో ఈ జి.ఓలపై తెలుగుదేశం సభ్యులు చర్చకు డిమాండ్ చేస్తే మంత్రి, ఎమ్మెల్యే మేయర్ ని డమ్మీ చేసి మా కార్పోరేటర్లు ఏమి నేరం చేశారు అని అరెస్ట్ చేశారు. కమిషనర్, కలక్టర్  మున్సిపల్ చట్టంను అమలు చేయాలని, మీరు ఇట్లానే చేస్తామంటే మా తెలుగుదేశం పార్టీ సభ్యులు రాజీనామా చేయడానికి కూడా వెనుకాడము అన్నారు. నిన్నకౌన్సిల్ లో జరిగిన మా కార్పోరేటర్ల అక్రమ అరెస్ట్ లపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. టీడీపీ హయాంలో అవినీతి జరిగింది అని వైసీపీ నాయకులు అంటున్నారు, గతంలో మేము చేసిన పాలనపై మీరు ఎటువంటి విచారణ చేసినా చేసుకోండి. మీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు అన్నరు. రెండేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు. విచారణ ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. మా తప్పు లేదు కాబట్టే నోటికొచ్చునట్లు మాట్లాడి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు అన్నారు. రెండు రాష్ట్రాల మద్య జల‌ వివాదాలు  ఎప్పుడు, ఎందుకు, ఎలా వచ్చాయో అందరూ ఆలోచించాలి అన్నారు. చంద్రబాబు సిఎం గా ఉన్నప్పుడు పరిష్కార మార్గాలు చూసుకుని వెళ్లారు. పక్కా ప్రణాళికతో 13జిల్లాల్లో నీటి ప్రాజెక్టు లు చేపట్టాం అని, ఈ రెండేళ్లలో జగన్మోహన్ రెడ్డి అటువంటి ప్రయత్నం ఎందుకు‌ చేయలేదు అని అడిగారు. ఒక పద్దతి ప్రకారం చంద్రబాబు చేయబట్టే అనేక ప్రాజెక్టు లు పూర్తి అయ్యాయి అని, చివరి దశలో ఉన్న ప్రాజెక్టు లను కూడా వైసిపి ప్రభుత్వం పూర్తి చేయలేకపోతుంది అన్నారు. ఈ ప్రభుత్వానికి భవిష్యత్తు కార్యాచరణ, అవగాహన లేదు. రాయలసీమ ఎత్తిపోతల పధకం పేరుతో కొత్త వివాదం లేపారు అని, ఎగువ ప్రాంతాలలో ప్రాజెక్టు లు కడితే, దిగువ రాష్ట్రాలకు నష్టం. ఎఫెక్ట్స్ కౌన్సిల్ , కేంద్ర జలశక్తి శాఖ స్పందించి పరిష్కరించాలి అన్నారు. ఎవరైనా చట్ట ప్రకారం ముందుకెళితే ఇబ్బందులు ఉండవు అని తెలిపారు.. ఇరు రాష్ట్రాల  సిఎం లు కూర్చుని మాట్లాడుకోని ఏ ప్రభుత్వం చేసిందని కాకుండా ఎవరైనా రైతుల మంచి గురించి ఆలోచించాలి అని అన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా ఇంకా టీడీపీ పై విమర్శలు చేయడం వైసిపి ప్రభుత్వం చేతకాని తనానికి నిదర్శనం అన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, టీడీపీ కార్పొరేటర్లు వల్లభనెని రాజేశ్వరి, వీరమాచినెని లలిత, కంచి దుర్గ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు పాల్గున్నారు.

Check Also

స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంటరీని ఆవిష్కరించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

-విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం లో రాష్ట్ర స్థాయి కార్యక్రమం -స్ధానిక ఆనం కళా కేంద్రంలో జిల్లా స్థాయి కార్యక్రమానికి ఏర్పాట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *