విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గొల్లపూడి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని ఈవీఎంలను భద్రపరిచిన జిల్లా ఎలక్షన్ గోదామును శుక్రవారం జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ సాధారణ తనిఖీలలో భాగంగా పరిశీలించారు. గోడౌన్ కు వేసిన సీల్డ్ లను, ఈవీఎంల రక్షణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను, సిసి కెమెరాల నిఘా ను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈవీఎం, వివి ప్యాట్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను ఎన్నికల సంఘానికి పంపవలసి ఉంటుందన్నారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో నిఘా ఉంచాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ నిర్వహించారు. తనిఖీలో డిఆర్ఓ యం. లక్ష్మినరసింహం, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ యం.రామకృష్ణ, రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.కిరణ్, పి.యేసు దాస్, కె. పరమేశ్వరరావు, వై రామయ్య ,ఎం వినోద్ కుమార్, పి.వి. శ్రీహరి,అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Tags vijayawada
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …