Breaking News

పి.సి.ఆర్. లండన్ వాల్వ్ అంతర్జాతీయ వైద్య సదస్సులో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వైద్యులకు ప్రశంసలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధునిక వైద్య సాంకేతికతతో గుండె కవాటాలను ఓపెన్-హార్ట్ సర్జరీ అవసరం లేకుండా ట్రాన్స్‌కాథెటర్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ (TAVR) విధానంలో మార్చడం ఇప్పుడు సాధ్యమవుతుంది. ఈ మినిమల్ ఇన్వేజివ్ ప్రక్రియతో,తక్కువ రిస్క్‌తో మరియు వేగంగా కోలుకోవడం సాధ్యమవుతుంది. వృద్ధులు మరియు ఆరోగ్య సమస్యలున్న రోగులకు ఇది అనుకూలంగా ఉంటుంది,ఈ విధానంలో ఓపెన్-హార్ట్ సర్జరీ అవసరాన్ని తొలగించి రిస్క్‌ను తగ్గిస్తుంది.

ఇండియా వాల్వ్స్, పి.సీ.ఆర్. టోక్యో వాల్వ్స్, మరియు పి.సీ.ఆర్.లండన్ వాల్వ్స్ వంటి జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై రమేష్ హాస్పిటల్స్ చేపట్టిన క్లిష్టమైన చికిత్సా విధానాలు వైద్య నిపుణుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ నెల 26వ తేదీన లండన్‌లో జరిగిన పి.సీ.ఆర్. లండన్ వాల్వ్స్ సదస్సులో, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నూకవరపు రాజా రమేష్ పాల్గొని తీవ్ర లెఫ్ట్ వెంట్రికులర్ డిస్‌ఫంక్షన్ ఉన్న రోగికి అయోటిక్ కవాట మార్పిడి విజయవంతంగా నిర్వహించిన విధానంపై సదస్సులో హాజరైన సభ్యుల నుండి ప్రశంసలు అందుకున్నారు.

ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా టావి (TAVI) మరియు మైట్రాక్లిప్ చికిత్సలను విజయవంతంగా నిర్వహించిన రమేష్ హాస్పిటల్స్,ఇప్పటివరకు 30కి పైగా రోగులకు అయోటిక్ లేదా మైట్రల్ కవాటాలను శస్త్రచికిత్స అవసరం లేకుండా ట్రాన్స్ క్యాతటర్ వాల్వ్ రీ ప్లేస్మెంట్ విధానంలో విజయవంతంగా నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ వేదికలపై మరోసారి ప్రత్యేక ముద్రవేసిందని తెలిపారు.
గుండె కవాటాల మార్పిడి చికిత్సలు ఇంటర్వెన్షన్ పద్ధతిలో అత్యంత క్లిష్టమైనవని, అయితే ఆధునిక వైద్య సాంకేతికత మరియు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో కవాటాల సైజ్,షేప్ ను 3D ప్రింటింగ్ ద్వారా అమర్చే సమయంలో ఖచ్చితత్వం ఉంటుందని దీని ద్వారా కరోనరీ ఆర్టరీలు మూసుకుపోయే ప్రమాదాన్ని కూడా ముందుగా అంచనా వేయవచ్చని తమ హాస్పిటల్స్ లో చేసిన క్లిష్ట తరమైన కేసులను జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురించబడ్డాయని ఆంధ్రప్రదేశ్‌లో అత్యుత్తమ అధునాతన గుండె వైద్య సేవలను అందించడంలో రమేష్ హాస్పిటల్స్ ఎప్పటికీ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రగతిలో తమ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ వైద్య బృందం కీలక పాత్ర పోషించిందని, వారి నైపుణ్యం మరియు కృషి వల్ల ఈ ఘనత సాధ్యమైందని తెలియచేస్తూ వారిని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ సీనియర్ మరియు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు డాక్టర్.భాస్కరనాయుడు, డాక్టర్.జి.కృష్ణ మోహన్,డాక్టర్.సోమనాథ్, డాక్టర్.రాజా రమేష్, డాక్టర్.అనూప్, డాక్టర్.రామ్ మనోహర్, డాక్టర్.మధుకృష్ణ, డాక్టర్.వెంకటేష్ రెడ్డి, డాక్టర్.చంద్ర మౌళి, డాక్టర్.షహానాజ్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్.నాదెళ్ల గిరిబాబు పాల్గొన్నారు.

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *