Breaking News

అర్జీలను చాలా జాగ్రత్తగా పర్యవేక్షించి పరిష్కరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కు వచ్చే అర్జీలను చాలా జాగ్రత్తగా పర్యవేక్షించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ క్షేత్రాధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి క్యాంపు కార్యాలయం నుండి క్షేత్రాధికారులతో మీకోసం కార్యక్రమం అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) అంటే చాలామంది సాధారణంగా తీసుకుంటున్నారని దీంతో చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని గ్రహించాలన్నారు. రాష్ట్ర రాజధానికి జిల్లా దగ్గరగా ఉన్నందున ప్రభుత్వ విధానాల అమలుపై అందరి దృష్టి ఉంటుందన్నారు. దీనిని చాలా తీవ్రంగా పరిగణించి శ్రద్ధగా పర్యవేక్షించాలన్నారు. అందరూ మండల స్థాయి అధికారులు ప్రతి సోమవారం ఉదయం 9:30 గంటలకే తహసిల్దార్ కార్యాలయానికి తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. మీకోసం కు వచ్చే ప్రతి అర్జీ పి జి ఆర్ ఎస్ వెబ్సైట్ లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. చాలా మండలాల్లో అప్లోడ్ చేయక సున్నా అర్జీలు అని ఉంటుందన్నారు. ఏ ఒక్కరు కూడా అర్జీలు తీసుకొని రావడం లేదా అని గట్టిగా ప్రశ్నించారు. పించను, రేషన్ కార్డు కావాలని వచ్చినప్పుడు ఇప్పుడు కాదని చెప్పి పంపుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అలా కాకుండా ఇకపై వారు అటువంటి దరఖాస్తులు వచ్చినప్పుడు తీసుకొని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని, విచారించి సిద్ధంగా ఉంచుకోవాలని, ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు.

అర్జీల పరిష్కారం లో కూడా సరిగా నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదన్నారు. అర్జీదారులకు తప్పనిసరిగా ఎండార్స్ చేసి సమాధానాన్ని అందేలా చూడాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఫోన్ చేసినప్పుడు అర్జీదారులు తమకు సమాధానం రాలేదని చెప్పడం జరుగుతుందని, దీంతో వారు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారన్నారు. ఇకపై అలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏదైనా అర్జీ వచ్చినప్పుడు దానిపై విచారణకు పోయినప్పుడు ఆ విషయం అర్జీదారునికి తెలియడం లేదని అతనిని సంప్రదించకుండానే విచారించుకొని తిరిగి వస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఇకపై అలాగా జరగ కూడదని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తహసిల్దార్లు ఎంపీడీవోలు వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *