-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన 10 ఫిర్యాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యలను నిత్యం పరిష్కరించే దిశగా జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం ఉదయం కమిషనర్ ధ్యానచంద్ర సూచన మేరకు అధికారులు నిర్వహించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారులు 10 ఫిర్యాదులు అందుకున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు స్వీకరించిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని ఫిర్యాదులు అందించిన ప్రజలతో అన్నారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అత్యధికంగా పట్టణ ప్రణాళిక విభాగం లో 5 అందుకున్నారు, ఇంజనీరింగ్ 2, ప్రజారోగ్యం 1, రెవిన్యూ విభాగం లో 1, హార్టికల్చర్ 1 ఫిర్యాదులను అధికారులు అందుకున్నారు.
ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ బి చంద్రశేఖర్, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి సృజన, ఇంచార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, సుపరింటంగ్ ఇంజనీర్ పి.సత్యనారాయణ, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) నారాయణ, డీఎఫ్ఓ మాల్యాద్రి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి.ఎస్.ఎస్ సోమశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.