Breaking News

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా వైఎస్ఆర్ చేయూత మహిళలకు ఆర్థిక భరోసాను కల్పించింది…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మహిళలకు ఆర్థిక స్వావలంబనను కల్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళల ఆర్థిక పురోభివృద్దికి చేయూతనందింస్తుంది. చేయూత పథకం ద్వారా ఆర్థికంగా బలో పేతం చెందిన లబ్దిదారుల మాటల్లోనే విందాం.. చేయూత మాకు కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పించిందంటున్నారు పెదపారుపూడి మండలం వానపాముల గ్రామనికి చెందిన మెండె ఆదమ్మ, మెండే ఆదమ్మ పేద కుటుంబానికి చెందిన మహిళ. వీరికి వివాహం అయిన నాటి నుంచి భర్తకు చేదోడు వాదోడుగా వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి చదువు లేకపోయిన వీరి ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించారు. కష్టాన్ని నమ్ముకుని జీవించే ఈ దంపతులు కూలి పనులతో పాటు వ్యవసాయమే జీవనాధరంగా ఐదెకరాలు కౌలుకు తీసుకొని సేద్యం చేస్తున్నారు. కౌలు వ్యవసాయం వలన వచ్చిన ఆదాయం పెట్టుబడికి తెచ్చిన అప్పులకే సరిపోవడంతో ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కునేవారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు వై.యస్.ఆర్ చేయూత పథకం ప్రకటించడం, ఆ పథకానికి ఆదమ్మ అర్హత కలిగి ఉండటంతో దరఖాస్తు చేసింది. అర్హతలు అన్ని సరిపడటంతో గత ఏడాది రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన మొదటి విడత వై.యస్.ఆర్ చేయూత పథకం క్రింద రూ.18,750 తమ ఖాతాలో జమ అయింది. దీంతో ఆదెమ్మ వానపాముల గ్రామంలోనే కిరాణా షాపును ప్రారంభించింది. గతంలో భర్తతో పాటు తను కూడా కూలీపనులు చేస్తున్నా చాలిచాలని ఆదాయంతో కుటుంబ ఫోషణ భారంగానే ఉండేది. కుటుంబ పోషణ నిమిత్తం గతంలో కూలి పనులు లేనప్పుడు అప్పలు చేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వారమని నేడు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా సొంతగా కిరాణా షాపును నడుపుకోవడం చాలా తృప్తిగా ఉందన్నారు. దీనికి తోడు స్వయంసహాయక సంఘంలో సభ్యులరాలుగా ఉన్నందున డ్వాక్రా ద్వారా వచ్చే ఆర్థిక సహాయంతో పచారి షాపును ఇంకా అభివృద్ది చేసి గ్రామంలోని ప్రజలకు పట్టణప్రాంతాల్లో దొరికే అన్ని పచారి సామానులు అందుబాటులో ఉంచడంతో పెట్టుబడితో పాటు లాభాలు కూడా వస్తున్నాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ జీవితం ఎలా ఉంటుంతో అని భయపడేవారమని, నేడు వైఎస్ఆర్ చేయూత ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించి మా జీవితాల్లో వెలుగు నింపి ఆర్థిక భరోసాను కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని మెండే ఆదమ్మ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.
వైఎస్ఆర్ చేయూత లబ్దిదారులు పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామానికి చెందిన వడ్లాది పద్మావతి వివరిస్తూ గతంలో తన భర్త నూకరాజుతో కలసి కూలిపనులు చేస్తు వచ్చిన చాలీచాలని ఆదాయంతో కుటుంబ పోషణ చేస్తూ జీవనం సాగించేవారము. వై.యస్.ఆర్ చేయూత పథకం క్రింద నేను ఎంపిక కావడంతో రూ.18,750 నా ఖాతాలో జమ అయింది. గ్రామంలో టిఫిన్ హోటల్ ప్రారంభించాను. వచ్చిన లాభంలో కొంత ఆదా చేయడమే కాకూండా మరో ఇద్దరుకు హోటల్ లో పని కల్పించి ఉపాధిని అందించడం చాలా సంతోషంగా ఉందంటూ ఆర్థిక చేయూతనందించిన సీయం జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన మరో లబ్దిదారిని కురువెళ్లి అలివేలు మంగమ్మ వివరిస్తూ గతంలో ఏ పని వున్నా భర్తతో కలసి కూలి చేసుకుని వచ్చిన ఆదాయంతో జీవించేవారమన్నారు. మాకు ప్లాస్టిక్ చాపలు కొనడం, అమ్మడంలో కొంత నైపుణ్యం ఉండటం వలన చేయూత పథకం ద్వారా వచ్చిన ఆర్థిక సహాయంతో ప్లాస్టిక్ చాపలు, ఇతర ప్లాస్టిక్ సామానులు కొనుగోలు చేసి ఇంటి వద్దనే అమ్మడంతో పాటు గ్రామాల్లో తిరుగుతూ అమ్ముకోవడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. మహిళల ఆర్థిక ప్రగతి ఆకాంక్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాలాంటి వారికి వైఎస్ఆర్ చేయూత పథకాన్ని వరంలా అందించి ఆదుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందిస్తూ జీవితాంతం ఆయన వెంటే మీముంటామంటూ ధన్యవాదాలు తెలిపారు.

Check Also

పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

-సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *