మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆదివారం ఆర్ అండ్ బి అతిది గృహంలో మున్సిపల్ ఇంజనీరింగ్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు వాటి ప్రగతి సమీక్షించారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పెండింగ్ పనుల గురించి ఆరా తీశారు. అమృత్ స్కీం క్రింద ఇంకా చేయవలసిన పనుల గురించి, నగరంలో వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగరంలో చేపట్టిన డ్రైన్లు, రోడ్ల అభివృద్ధి పనులు నాణ్యత పాటించేలా చూడాలన్నారు. వర్షాలు తగ్గగానేగిలకలదిండి డ్రైన్ పూడికతీత పనులు ప్రారంభించాలని మంత్రి సూచించారు. నగరంలో ప్రతి సర్వీస్ రిజర్వాయరుకు జోనింగ్ చేయలన్నారు. నగరంలో అపార్టుమెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మాణాలకు సంబంధించి నిబంధనల మేరకు సెట్ బ్యాక్ లేకుండా అనుమతించరాదని, అపార్టుమెంట్లు, కమర్షియల్ కాంప్లెకు సంబంధించిన విద్యుత్ ట్రాన్సుఫర్మర్లు రోడ్ల పై పెట్టవద్దని , ప్రతి ఎఇ పరిధిలో ఇలాంటివి ఎన్ని ఉన్నాయో గుర్తించాలని లోపలే ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎందుకంటే అలాంటి చోట్ల వీధి దీపాల ఏర్పాటుకు ఆవరోదంగా మారుతున్నాయన్నారు. నగరంలో ఆయా డివిజన్ల లో అవసరమైన చోట్ల కొత్త కరెంటు స్థంబాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులకు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన క్లిన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమం క్రింద త్వరలో నగరంలో ప్రతి ఇంటికి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేయబోవు డస్ట్ బిన్సు నాణ్యత మంత్రి పరిశీలించారు. ఈ సమావేశంలో మున్సిపల్ నగరపాలక కమీషనర్ సబ్బి శివరామకృష్ణ, ఎంఇ త్రినాద్ బాబు, కార్పొరేటర్ లంకా సూరిబాబు, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, విద్యుత్ శాఖ ఇఇ సాంబశివరావు, డిఇఇలు కృష్ణా రెడ్డి , రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
