ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 19 వ తేదీన సోమవారం ఉదయం 9 గంటలకు ముదినేపల్లి మండలంలో జరిగే రైతు చైతన్య యాత్ర కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికారులు, మండల నాయకులు, కృషి చేయాలనిశాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కోరారు. ఆదివారం ముదినేపల్లి తాహశీల్థారు శ్రీనివాస్, పార్టీ నాయకులతో కలసి బొమ్మినంపాడు హై స్కూల్ లో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 9 వ తేదీనుండి 23 వ తేదీ వరకు నిర్వహిస్తున్న రైతు చైతన్య యాత్రల్లో భాగంగా ముదినేపల్లి మండలంలో ఈ నెల 19 వ తేదీన సోమవారం నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి శ్రీ వేంకటేశ్వర రావు(నాని)లతో పాటుగా జిల్లా కలెక్టర్ జె. నివాస్, జాయింట్ కలెక్టర్ మాధవిలత, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ టి.మోహనరావు,మ జిల్లా ఉన్నతాధికారులు పాల్గొంటున్నారన్నారు. ముదినేపల్లి మండలంలోని సింగరాయపాలెం నుండి రైతు చైతన్య యాత్ర బొమ్మినంపాడు వరకు సాగి అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో వ్యవసాయ శాఖ ఎగ్జిబిషన్ ను తిలకించి రైతులతో సమావేశం అవుతారన్నారు. ముఖ్యంగా మండల పరిధిలో గల 32 గ్రామాల్లోని రైతులు హాజరయ్యే విధంగా మండల నాయకులు ఆయా గ్రామాల నాయకుల్ని సమాయత్త పరచి విజయవంతం చేయడానికి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ముదినేపల్లి మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు కరేటి గోవిందరాజులు,దాసరి చిరంజీవి,కోట సత్యనారాయణ, రాజా, పాల్లంకి రామారావు, క్యేనం ప్రసాద్, ఉమ్మడిశెట్టి రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
Tags Mudenaypalli
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …