Breaking News

అర్హులైన అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు అందిస్తాం… : ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు

కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన ప్రతి అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలను అందిస్తామని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు.
స్థానిక శాససభ్యులు అధికారిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఇంటి స్థలాల కొరకు అర్జీలు దాఖలు చేసిన గోనేపాడు అక్కచెల్లెమ్మలకు ఇల్ల స్థలాలు మంజూరు చేయాలనిగ్రామ సర్పంచ్ బత్తిన శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో పలువురు మహిళలు ఎమ్మేల్యే డిఎన్ఆర్ ను కోరారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత వీఆర్వో వీర్రాజుతో మాట్లాడుతూ గోనెపాడు గ్రామంలో అర్హులు అయిన అక్కచెల్లమ్మలు ఎంత మంది వున్నారో వారికీ తక్షణమే రెవిన్యూ అధికారులు పూర్తిగా విచారణ చేసి అర్హతను తేల్చి వారంలోపు పూర్తి సమాచారం తనకు ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా గోనెపాడు గ్రామంలో భూమి కొని అర్హులందరికీ స్థలాలు పంచుతామని హామీఇచ్చారు. అధికారుల నిర్లక్ష్యం వలన ఇప్పటి వరకు స్థలాలు ఇవ్వలేకపోయారని, వారం రోజులలో పూర్తిగా విచారణ చేసి భూమిని కొని అర్హులు అందరికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇస్తామన్నారు. కార్యక్రమంలో బొల్లా రాంబాబు,బొర్రా సురేంద్ర, రాధాకృష్ణ,లబ్ధిదారులు, నంగెడ్డ మంగమ్మ, బొర్రా మంగాదేవి, బత్తిన కుమారి, మరగాని నాయేమి, వీరమల్లు నాగరాణి, గుట్ల రూపా, లక్ష్మి,, శివజ్యోతి, శ్యామల, ఉషారాణి, సాయిలక్ష్మి, నాగమణి, వెంకటలక్ష్మి, అనూష తదితరులు పాల్గొన్నారు.

Check Also

జాతీయ లోక్ అదాలత్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *