Breaking News

విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు..

-విశాఖలోని ఓ స్కానింగ్ సెంటర్లో మహిళను సిబ్బంది వేధింపులకు గురిచేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్..
-మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు..
-నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సెంట్రల్ జైలుకు తరలింపు..

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నం నగరంలోని ఓ హాస్పిటల్ లో స్కానింగ్ కోసం వచ్చిన మహిళపై అక్కడి సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తలకు గాయం తగిలిన మహిళపై అసభ్యంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా అసభ్యంగా ప్రవర్తించిన స్కానింగ్ సెంటర్ సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన 3వ టౌన్ పోలీసులు సదరు స్కానింగ్ సెంటర్ ఇన్ ఛార్జ్ ప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పీఎన్‌సీ 74, 76 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి రిమాండ్ విధించగా విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *