Breaking News

రైతును రాజుగా చేయాలన్న వైఎస్సార్ కలను నిజం చేస్తున్న సీఎం జగన్మోహనరెడ్డి…


-రైతులకు మేలైన విత్తనాలను పంపిణీ చేస్తున్నాం
: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
-ప్రతి రైతు ఈ క్రాప్ బుకింగ్ తప్పని సరిగా నమోదు చేసుకోవాలి..
-వైఎస్ఆర్ చేయూత కింద 10 వేల పశువులను, 5 వేల గొర్రెలు, మేకలను రైతులకు అందించాం..
-రైతుల సమస్యలు పరిష్కరించే విధంగా మండల కేంద్రాల్లో స్పందన కార్యక్రమం నిర్వహణకు చర్యలు.
: కలెక్టరు జె. నివాస్

గుడివాడ/ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రైతును రాజుగా చేయాలన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కలను సీఎం జగన్మోహనరెడ్డి నిజం చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం ముదినేపల్లి మండలం బొమ్మినంపాడు గ్రామంలో జరిగిన రైతు భరోసా సదస్సుకు మంత్రి కొడాలి నాని ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను మంత్రి కొడాలి నాని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిందన్నారు. ఈ రెండేళ్ళలో చేపట్టిన కార్యక్రమాల్లో ఎక్కువగా వ్యవసాయం పైనే దృష్టి పెట్టారన్నారు. రైతు రాజులా ఉండాలని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కలగనే వారని అన్నారు. ఆ కలను నెరవేర్చడానికి ఆర్ధిక పరిస్థితులు సహకరించకపోయినా ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని, వాటికి అవసరమైన సొంత భవనాలను నిర్మించాలని, పనిచేసేందుకు ఉద్యోగులను నియమించాలని, ప్రతి నియోజకవర్గంలోనూ భూసార పరీక్షలను నిర్వహించే ల్యాబ్ లను నెలకొల్పాలని, మెట్ట ప్రాంతాల్లో సాగునీటి సమస్య రాకుండా జలకళ ద్వారా బోర్లు ఏర్పాటు చేయాలని, రెండు పంటలకు సాగునీరు అందించాలని అనేక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాజెక్ట్ కు మధ్యలో నిలిచిపోయి ఉన్నాయని, వాటన్నింటినీ పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు. రైతును రాజులా చూడాలంటే పెట్టుబడి సాయాన్ని అందించాలని భావించారన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర అందకపోతే రైతుభరోసా కేంద్రాల ద్వారా అందే ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. రైతులు నష్టపోకుండా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారన్నారు. రైతు తన కాళ్ళపై తాను నిలబడుతూ, దేశానికి వెన్నుముకగా ఉండాలన్న ఉద్దేశ్యంతో సీఎం జగన్మోహనరెడ్డి అనేక కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పండిన పంటలో 90 శాతం సివిల్ సప్లయిస్ కు వస్తుందన్నారు. గతంలో రైతులకు రెండు, మూడు నెలలకు కూడా ధాన్యానికి సంబంధించిన డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. రైతుకు ధాన్యం డబ్బులు సకాలంలలో చెల్లించాలన్న ఉద్దేశ్యంతో 21 రోజుల నిబంధనను సీఎం జగన్మోహనరెడ్డి విధించుకున్నారన్నారు. ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి రైతులకు రూ.3,200 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. 21 రోజుల గడువు దాటి రూ.1,204 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. రైతుల దగ్గర నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి సివిల్ సప్లయిస్ వినియోగించుకున్న తర్వాత మిగతా ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ విధంగా కేంద్రం నుండి రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు రూ. 5,056 కోట్లు రావాల్సి ఉందన్నారు. కేంద్రం నుండి బకాయిలు రాకపోయినప్పటికీ బీజేపీ నేతలు మాత్రం విజయవాడలో పత్రికా సమావేశాలను నిర్వహించి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారన్నారు. రైతులు అమాయకులని, ఏం చెప్పినా నమ్ముతారన్న భ్రమలో బతుకుతున్నారన్నారు. రెండు రోజుల్లో నాబార్డ్ నుండి రూ. 1,600 కోట్లు రానున్నాయని తెలిపారు. ఈ నెల 25 నాటికి కేంద్ర ప్రభుత్వం కూడా మరో రూ. 1,600 కోట్లు విడుదల చేస్తానని చెప్పిందన్నారు. ఈ నెలాఖరు నాటికి రైతులకు చెల్లించాల్సిన రూ.3,200 కోట్ల మొత్తాన్ని చెల్లిస్తామన్నారు. రైతులకు ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ నివాస్ నిర్ణయించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆలోచనలను అమలు చేయడంతో పాటు జిల్లా కలెక్టర్ కూడా సమర్ధవంతమైన నిర్ణయాలను తీసుకుంటున్నారన్నారు. ఇటువంటి కలెక్టర్ కృష్ణాజిల్లాకు రావడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ అధికారులు, ప్రజాప్రతినిధులంతా జగన్ సైన్యంలా చిత్తశుద్ధితో పనిచేయడం జరుగుతోందన్నారు. భవిష్యత్తులో రైతుల సంక్షేమం కోసం సీఎం జగన్మోహనరెడ్డి మరిన్ని కార్యక్రమాలను చేపడతారని మంత్రి కొడాలి నాని అన్నారు. అనంతరం రైతులకు నూతన వరి వంగడాల విత్తనాలను పంపిణీ చేశారు. ముందుగా పుంగనూరు జాతి ఆవులకు మంత్రి కొడాలి నాని పూజలు చేశారు.

జిల్లా కలెక్టరు జె. నివాస్ మాట్లాడుతూ రైతు చైతన్య యాత్రలు ద్వారా చైతులను చైతన్య పర్చడమే కాకుండా తరతరాలుగా వ్యవసాయాన్ని చేస్తున్న రైతులు ఎన్నోరకాల వారి అనుభవాలు పద్దతులను కూడా మనం నేర్చుకోవల్సివుందన్నారు. అధికారులు సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించే సేవలు గురించి పూర్తిగా తెలుసుకొని ప్రణాళికా బద్దంగా అమలు చేయాలన్నారు. గతంలోమాదిరి కాకుండా ఈ సారి రెట్టింపు చేసి రైతుకు కావలసిన నాణ్యమైన విత్తనాలను ఆర్బీకేల ద్వారా ఈ ఖరీఫ్ సీజన్ లోనే అందించే విధంగా చర్యలుతీసుకుంటాన్నారు. సబ్సిడీ ద్వారా అందించే విత్తనాల్లో రైతులకు రూ. 750 ఆదా అవుతుందన్నారు. విత్తణాలు, ఎరువులు, పురుగుమందులు నాణ్యతను తెలుసుకొనేందుకు ప్రతి నియోజకవర్గంలో అగ్రి, ఆక్వాల్యాబ్ లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో 13 ల్యాబ్ లకు గాను 11 ల్యాబ్ లకు భవనాలు నిర్మించి ప్రారంభించుకున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు 5 ఆక్వాల్యాబ్ లను మంజూరు చేసారని, ఇప్పటికే కైకలూరులో ఏర్పాటు చేయడం జరిగిందని మరో నాలుగు ఆక్వాల్యాబ్ లు అందుబాటులోనికి రానున్నాయన్నారు. ప్రతి రైతు బయోమెట్రిక్ అధెంటీటీతో ఈ క్రాఫ్ బుకింగ్ ద్వార వారు వేసిన పంటను నమోదు చేసుకోవాలన్నారు. పంట నష్టపరిహారం గా ఇన్ ఫుట్ సబ్సిడీ అందించే సమయంలో ఇబ్బంతులు లేకుండా ఉంటాయన్నారు. రైతులు వ్యవసాయంతో పాటు వారి ఆదాయాన్నిపెంచుకునే విధంగా అనుబంధ శాఖలయిన హార్టికల్చర్, పశుసంవర్థక, మత్య్స శాఖల ద్వారా అందించే ప్రయోజనాలను కల్పిస్తామన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ చేయూత కింద 10 వేల పశువులను, 5 వేల గొర్రెలు, మేకలను రైతులకు అందించామన్నారు. యంపెడ ద్వారా ఆక్వా రంగంలో రైతులకు విద్యుత్ తో పాటు రైతులకు మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. రైతులకు మేలు జరిగే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని కలెక్టరు అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా మండలస్థాయిలో వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక శాఖల అధికారుల సమన్వయంతో ప్రతి వారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా త్వరలో చర్యలు చేపడతామని కలెక్టరు జె. నివాస్ పేర్కొన్నారు.

సభకు అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యలు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్.జగన్మోహన్ రెడ్డి పేరుతో రైతు చైతన్య యాత్రలు నిర్వహించడం సంతోదాయకమన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నాటినుంచి దేశం గర్వించే విధంగా రైతు సంక్షేమమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. గత రెండేళ్ళగా జిల్లాలో కృష్ణా,గోదావరి నదుల్లో పుష్కలంగా నీరు ఉండటంతో ప్రభుత్వం రైతులకు రెండు పంటలకు నీరు అందిస్తుందన్నారు. నష్టాల ఊబిలో అప్పుల పాలై ఉన్న చేపల, రొయ్యల సాగు రైతులు నేడు ఆటపాడు వరకు నీరు అందించడంతో ఆక్వా రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి రైతు శ్రేయస్సు కోరుతూ దళారి వ్యవస్థ లేకుండా ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఆర్బీకే ద్వారా అందిస్తున్నారన్నారు.
కార్యక్రమంలో మండవల్లి మండలం లింగాల, కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామానికి చెందిన ఆదర్శ రైతులు ఉడతమద్ది రామయ్య, నరహరిశెట్టి శివరామయ్య వారు చేస్తున్న ప్రకృతి వ్యవసాయంపై రైతులకు వివరించారు. ఆచార్య రంగా విశ్వవిద్యాలం సీనియర్ సైంటిస్తు డా. యం. గిరిజారాణి, భావదేవరపల్లి మత్య్స పాలిటెక్నిక్ కళాశాల ఫ్రిన్సిపాల్ డా. చంద్రశేఖర్, గన్నవరం పశువైద్యశాఖ కళాశాల ప్రోఫెసర్ సుబ్రమ్మణ్ణేశ్వరి ప్రసంగించారు.
తొలుత వ్యవసాయ, మత్స్య, పశుసంపర్థక శాఖలు అమలు చేస్తున్న వివిధ పథకాలను స్టాల్స్ లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. అనంతరం ముదినేపల్లి మండలంలో రూ.4 లక్షలు, మండవల్లి మండలంలో రూ. 5లక్షల విలువగల వ్యవసాయ పనిముట్లను రైతులకు మంత్రి కొడాలి నాని, కలెక్టరు నివాస్,జేసీ మాధవీలత, శాసనభ్యులు డిఎన్ఆర్, కైలై అనిల్ కుమార్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దూలం నాగేశ్వరరావు, కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్సీలు కల్పలత, కరీమున్నీసా, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత, వడ్డీ కార్పోరేషన్ చైర్ పర్సన్ ఎం గాయత్రీ సంతోషి, వ్యవసాయశాఖ జేడీ మోహనరావు, తహసీల్దార్ కే శ్రీనివాస్, ఎండీవో గుంజా మాధవరావు, ఏడీఏ స్వర్ణలత, ఏవో కే విద్యాసాగర్, వ్యవసాయ శాస్త్రవేత్తలు గిరిజా, చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యేశ్వరి, ఎంపీపీ అభ్యర్ధి రామిశెట్టి సత్యనారాయణ, వైసీపీ నాయకులు నిమ్మగడ్డ భిక్షాలు, బొర్రా శేషుబాబు, కే గోవిందరాజులు, పాతూరి అంజయ్య, పుట్టి సుబ్బారావు, శీలం రామకృష్ణ, అచ్యుత రాంబాబు, గూడపాటి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *