-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు అవసరమైన వసతులన్నీ కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 52వ డివిజన్లోని మల్లికార్జునపేట, ఉపరవాగు సెంటర్, పరిసర ప్రాంతాలన్నీ పర్యటించి సైడ్ కాలువలు, కమ్యూనిటీ టాయిలెట్లు, పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా పై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ త్రాగునీటి సరఫరా లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, పైపులు ఎక్కడ లీకేజ్ ఉన్న వెంటనే మరుమతులు చేయాలని, పైప్లైన్ ద్వారా ఇంటికి వెళ్లే త్రాగునీటి సరఫరా లో నీరు కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని, ఆ ప్రాంతంలో ఉన్న మెట్లను మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. సైడ్ కాలువల్లో ఉన్న వ్యర్ధాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుస్తూ ప్రతిరోజు వ్యర్ధ సేకరణ కచ్చితంగా చేస్తూ అక్కడున్న ప్రజలకు కాలువల్లో వ్యర్ధాలు పడేయకుండా అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి అందించాల్సిన సౌకర్యాలలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి అన్నారు.
ఉప్పర వాగు మగవారికి వారి క్వరి సమీపంలో ప్రజలకు అవసరమైన సంపు, వాహనాలు నిలుపుదకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలని, అవసరమైన చోట కాలువల పైన గ్రేటింగ్ లు వేయించాలని, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంట్ ఇంజినియర్ వర్క్స్ పి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి, సానిటరీ సూపర్వైజర్ శివరాం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.