Breaking News

ఘనంగా రాయుడు గారి మిలటరీ హోటల్‌ ప్రారంభం


ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాయుడు గారి మిలిటరీ హోటల్‌ను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోటల్‌ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. హోటల్‌లోని డైనింగ్‌ ఏరియా, కిచెన్‌, స్పెషల్‌ గదులను పరిశీలించారు. వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ముందుగా హోటల్‌ యాజమాన్యం ఎమ్మెల్యే కృష్ణప్రసాదును ఘనంగా స్వాగతించారు. అనంతరం హోటల్‌ యాజమాన్యం మాట్లాడుతూ అభిరుచిగల కస్టమర్‌ దేవుళ్ళు ఆదరిస్తున్నారని నమ్మకంతో మావద్దవున్న నైపుణ్యం గల చెఫ్‌లు వివిధ వంటకాలతో పాటు చేపల పులుసు, నాటు కోడి కర్రీ, రాగి సంగటి, చికెన్‌ కర్రీ, చికెన్‌ బిర్యాని, మాంసాహారులకు అతి రుచికరముగా తయారు చేస్తారని అన్నారు. సరికొత్త రుచులతో, అతి తక్కువ ధరలతో, నాణ్యతా ప్రమాణాలు మరియు పరిశుభ్రతను అనుసరిస్తూ రుచికరమైన వివిధ రకాల వంటకాలను అందిస్తున్నామని నగరవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. క్యాటరింగ్‌ మా ప్రత్యేకత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోటల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *