విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ‘సెంచరీ మ్యాట్రెస్సెస్’ ఎక్స్పీరియన్స్ స్టోర్‌ను ప్రారంభించింది. బుధవారం విజయవాడ ఏలూరురోడ్డులోని చల్లపల్లి బంగ్లావద్ద ‘సెంచరీ మ్యాట్రెస్సెస్’ డైరెక్టర్ ఉత్తమ్ మలాని, హోసన్నా మినిస్ట్రీస్ పి.ఎస్.రమేష్‌లతోపాటు పవన్‌ఎంటర్ ప్రైజెస్ నుంచి బి.చంద్రశేఖరరావు ఈ నూతన స్టోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మిస్టర్ ఉత్తమ్ మలాని మాట్లాడుతూ మా కొత్త స్టోర్‌ను కస్టమర్లు ఎలా కోరుకుంటున్నారో, వారి స్లీప్ సొల్యూషన్లను ఎలా ఎంచుకోవాలో పునర్నిర్వచించటానికి మంచి వేదికగా ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా నిద్ర ఔత్సాహికులు అనువైన సౌకర్యాలను కోరుకునే వారి కోసం ఒక ఎక్స్ పీరియన్స్ స్టోర్ గా రూపొందించబడిరదన్నారు. నాణ్యత, వినూత్న ఆవిష్కరణ, అసమానమైన సౌకర్యాల పట్ల మా అచంచలమైన నిబద్ధత మా బ్రాండు మూలస్తంభంగా ఉందన్నారు. వినియోగదారులకు వారి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా పరిపూర్ణమైన పరుపును కనుగొనడానికి వీలు కల్పిస్తుందని తెలిపారు. కొత్త స్టోర్‌లో వినియోగదారుల కోసం రూపొందించిన మెడ దిండ్ల వంటి పలు విస్తృతమైన నిద్ర ఉపకరణాలు ఉంటాయన్నారు. సెంచరీ మ్యాట్రెస్లు భారతదేశంలోని 4,500 అవుట్లెట్లు మరియు 450 ప్రత్యేక బ్రాండ్ స్టోర్ నుండి మల్టీ-బ్రాండ్ డీలర్లలో బలమైన ఉనికిని కలిగి వున్నాయన్నారు. వినూత్నమైన సీయూసెన్స్ సాంకేతికత శరీర ఉష్ణోగ్రతను సమన్వయం చేసి చల్లగా ఉంచుతుందని వివరించారు. హానికరమైన రసాయనాలు లేవని పేర్కొన్నారు. అధిక సాంద్రత కలిగిన మెమరీ ఫోమ్, అధునాతన కాయిల్ సిస్టమ్‌లను కలిగి ఉంటాయన్నారు. విభిన్న బడ్జెట్లో అందుబాటు ధరల్లో ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కొనుగోలుదారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …