విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నందుకు విజయవాడ వచ్చిన నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఎన్ యు జె )ప్రతినిధులు మంగళవారం ప్రపంచ ఇలవేల్పు అయిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ , ఇన్చార్జి ఈవో ఎం రత్న రాజు నేతృత్వంలో దర్శించుకున్నారు. దేశంలోని 18 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులకు రత్నరాజు ఆలయ విశిష్టతను వివరించారు. ప్రసాదాలు అందజేశారు. ఆంధ్ర ప్రదేశ్ లోనే కాక దేశంలో శక్తివంతమైన దేవతగా గుర్తింపు పొందిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాతీయ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు రాస్ బిహారి, ప్రధాన కార్యదర్శి మనోజ్ తివారి ఉపాధ్యక్షులు శివకుమార్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి విఎస్ఆర్ పున్నంరాజు ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …