Breaking News

మన ఆడబిడ్డలకు, మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని  61వ డివిజన్ పాయకపురం పార్క్ దగ్గర సుమారు రూ.12.లక్షల రూపాయల వ్యయంతో బుధవారం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టాయిలెట్లను  ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  బొండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేసి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:-తెలుగుదేశం ప్రభుత్వం సెంట్రల్ నియోజకవర్గాన్ని స్మార్ట్ సిటీ గా అత్యాధునిక అంగులతో ప్రజలకు అందుబాటులో  AC పబ్లిక్  టాయిలెట్స్ లను ఏర్పాటు చేసాము అని , వచ్చిన స్మార్ట్ పబ్లిక్ టాయిలెట్లను నగరంలోని రద్దీగా ఉండే ప్రదేశాలలో, పిల్లలు, మహిళలు వాకింగ్ చేసే పార్కులలో ఏర్పాటు చేయడం వల్ల వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని…గత వైసీపీ ప్రభుత్వం లో 5 సంవత్సరాలలో మురుగు డ్రైన్లను,పార్కుల అభివృద్ధిని పట్టించుకోలేదు అని, ఇటువంటి పార్కులు అభివృద్ధి చేయడం వల్ల మన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, వ్యాయామం చేయడం, ప్రకృతిని ఆస్వాదించడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము అని…కూటమి ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సాధ్యం అని,త్వరలో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో నిలుపుతాం అని బొండా ఉమ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు దాసరి దుర్గారావు (పెప్సీ ), నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, ఉమ్మడి రమాదేవి,ఆకుల సూర్యప్రకాష్,ఉమ్మడి వెంకటేశ్వరరావు,ఫణి కుమార్, నాగేశ్వరరావు, శివయ్య, గోపాల్, మధు బాబు, అన్నా బత్తుల శ్రీనివాస్, శివకుమారి తదితరులు పాల్గొన్నారు.

Check Also

అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *