-ఏక సభ్య కమిషన్కు 2025 జనవరి 9 లోగా రిప్రజెంటేషన్స్ సమర్పించవచ్చు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం (పంజాబ్ రాష్ట్రం & ఇతరులు Vs దేవిందర్ సింగ్ & ఇతరులు (సివిల్ అప్పీల్ నం. 2317 ఆఫ్ 2011), తేదీ 01.08.2024 న వెలువరించిన తీర్పు ననుసరించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలలోని ఉప-వర్గీకరణపై విచారణ చేయడానికి, రాజీవ్ రంజన్ మిశ్రా, ఐ.ఏ.ఎస్., (రిటైర్డ్) నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను నియమించబడినదని, సదరు ఏకసభ్య కమిషన్ కార్యాలయము గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయ మొదటి అంతస్తు, కోనేరు లక్ష్మయ్య వీధి, మొఘల్రాజపురం, విజయవాడ 520010, ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ నందు ఏర్పాటు చేయబడినదని, ఈ విషయంపై ఎవరైనా సంతకంతో కూడిన వ్రాతపూర్వక మొమోరాండం/ రిప్రజంటేషన్స్ లను, కార్యాలయపు పని వేళలందు ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రము 5.30 గంటల వరకు వ్యక్తిగతంగా, లేదా తిరుగు రసీదుతో కూడిన రిజిస్టరు పోస్టు ద్వారా, లేదా ఇమెయిల్ ఐడి : omcscsubclassificaton@gmail.com ద్వారా 2025 జనవరి 09 వ తేదీలోగా సమర్పించవచ్చుని జిల్లా ఎస్సీ సంక్షేమం సాధికారత అధికారి షాహిద్ బాబు షేక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.