మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి Aruna Sarika ఆదేశానుసారం, కృష్ణా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి K.V.Rama Krishnaiah ఆధ్వర్యంలో ది: 14.12.2024 న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాలు మరియు ఏలూరు జిల్లాలోని నూజివీడు, కైకలూరు కోర్టుల పరిధిలో ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద క్లైములు మరియు అన్ని రకాల సివిల్ కేసులు రాజీ చేసుకొనవచ్చును అని తెలిపారు. కనుక కక్షి దారులు తమ లాయర్లు ను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి Aruna Sarika తెలియజేసారు. మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ, కైకలూరు, గన్నవరం, తిరువూరు, జగ్గయ్యపేట, బంటుమిల్లి, మైలవరం, ఉయ్యూరు మరియు మొవ్వ కోర్టుల ఆవరణలో ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవలసింది గా కోరారు.
Tags machilipatnam
Check Also
ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం (ఏబీపీ)పై అధికారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -కలెక్టర్ …